Telangana: పులిచింతల ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-10-05T13:20:10+05:30 IST

జిల్లాలోని పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

Telangana: పులిచింతల ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తివేత

సూర్యాపేట: జిల్లాలోని పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 50,980 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా...ప్రస్తుత సామర్థ్యం 33.66 టీఎంసీలుగా కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 175 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 166.56 అడుగులుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2021-10-05T13:20:10+05:30 IST