Abn logo
Sep 25 2021 @ 08:55AM

Suryapeta: కోదాడలో 30 కేజీల గంజాయి పట్టివేత

సూర్యాపేట: కోదాడ మండలంలో రామాపురం ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజామున వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తుండగా బస్సులో తరలిస్తున్న 30 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రా నుండి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‎కు తరలించారు.

ఇవి కూడా చదవండిImage Caption