Suryapeta: నిండుకుండలా మారిన పులిచింతల ప్రాజెక్ట్

ABN , First Publish Date - 2021-07-18T14:00:21+05:30 IST

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పులిచింతల ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. పులిచింతల ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా...

Suryapeta: నిండుకుండలా మారిన పులిచింతల ప్రాజెక్ట్

సూర్యాపేట: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పులిచింతల ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. పులిచింతల ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 44.035 టీఎంసీలుగా కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులకు గాను... ప్రస్తుత నీటిమట్టం 173.882 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 14,130 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో నిల్‌గా ఉంది. 

కాగా..మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి పులిచింతల బ్యాక్ వాటర్ వచ్చి చేరుతుంది. కరకట్ట నుంచి లీకై ఆలయంలోకి నీరు వస్తుంది. దీంతో ఆలయంలో వచ్చిన నీటిని ఆలయ సిబ్బంది హై స్పీడ్ మోటర్లతో ఎత్తిపోస్తున్నారు.

Updated Date - 2021-07-18T14:00:21+05:30 IST