Suryapeta: పులిచింతల ప్రాజెక్ట్ 3 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

ABN , First Publish Date - 2021-07-23T14:08:02+05:30 IST

పులిచింతల ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ 3 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 25,990 క్యూసెక్కులు

Suryapeta: పులిచింతల ప్రాజెక్ట్ 3 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ 3 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 25,990 క్యూసెక్కులు కాగా, అవుట్‌ఫ్లో 18,662 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుత నీటి నిల్వ 44.03 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 173.88 అడుగులుగా ఉంది. రెండు యూనిట్లలో 60 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

కరకట్ట నుంచి బ్యాక్ వాటర్ లీకై..మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి వచ్చి చేరుతున్నాయి. హైస్పీడ్ మోటర్లతో ఆలయ సిబ్బంది నీటిని ఎత్తి పోస్తున్నారు.

Updated Date - 2021-07-23T14:08:02+05:30 IST