Suryapeta: పులిచింతల ప్రాజెక్ట్‎కు కొనసాగుతున వరద..10 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-08-03T14:02:53+05:30 IST

పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల

Suryapeta: పులిచింతల ప్రాజెక్ట్‎కు కొనసాగుతున వరద..10 గేట్లు ఎత్తివేత

సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. పులిచింతల ఇన్‌ ఫ్లో 2,12,992 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 2,69,336 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. పులిచింతల పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, ప్రస్తుతం 172.76 అడుగులుగా ఉంది. పులిచింతల పూర్తిస్థాయి నీటినిల్వ 45.77 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 42.34 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ నుంచి విద్యుదుత్పత్తి కోసం 13,200 క్కూసెక్కుల నీరు విడుదల చేశారు. నాలుగు యూనిట్ల ద్వారా 30 మెగావాట్ల విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.

Updated Date - 2021-08-03T14:02:53+05:30 IST