Suryapeta: పులిచింతల ప్రాజెక్ట్‌కు పోటెత్తుతున్న వరద..10 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-08-04T13:36:02+05:30 IST

పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తుతుంది. దీంతో జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు అప్రమత్తమై ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల

Suryapeta: పులిచింతల ప్రాజెక్ట్‌కు పోటెత్తుతున్న వరద..10 గేట్లు ఎత్తివేత

సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తుతుంది. దీంతో జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు అప్రమత్తమై ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. పులిచింతల ఇన్‌ఫ్లో 2,12,992 క్యూసెక్కులు కాగా, ఔట్‎ఫ్లో 2,69,336 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. పులిచింతల పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు ఉండగా, ప్రస్తుతం 172.76 అడుగులు ఉంది. పులిచింతల పూర్తిస్థాయి నీటినిల్వ 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 42.34 టీఎంసీలు ఉంది. విద్యుదుత్పత్తి కోసం 13,200 క్కూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. నాలుగు యూనిట్లలో 30 మెగావాట్ల విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.

Updated Date - 2021-08-04T13:36:02+05:30 IST