Abn logo
Oct 11 2021 @ 08:06AM

Suryapeta: పులిచింతల ప్రాజెక్ట్ 9 గేట్లు ఎత్తివేత

సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ తొమ్మిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. పులిచింతల ఇన్ ఫ్లో: 1,04,378 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో: 1,01,347 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుత నీటి సామర్థ్యం 33.18 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 166.205 అడుగులుగా ఉంది.

ఇవి కూడా చదవండిImage Caption