Abn logo
Aug 9 2021 @ 08:18AM

suryapeta: ఆర్టీసీ బస్సు-లారీ ఢీ..10 మందికి గాయాలు

సూర్యాపేట: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

క్రైమ్ మరిన్ని...