Advertisement
Advertisement
Abn logo
Advertisement
Mar 4 2021 @ 21:34PM

టీఎంసీలో ఉండి తప్పు చేశా: బీజేపీలో చేరగానే గుంజీలు

కోల్‌కతా: తాను తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉండి తప్పు చేశానంటూ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్న అనంతరమే సుశాంత్ పాల్ అనే నేత సభా వేదికపైనే గుంజీలు తీశారు. ఒకప్పుడు వామపక్షాలను ఓడించడానికి తాను టీఎంసీలో చేరానని, అయితే టీఎంసీ పాపాలు తనకు చాలా అంటుకున్నాయని వాటి నుంచి పాప పరిహారం పొందేందుకే గుంజీలు తీసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. గురువారం టీఎంసీ నుంచి బీజేపీ గూటికి చేరిన సువేంధు అధికారి సమక్షంలో కమల తీర్థం పుచ్చుకున్నారు.


సుశాంత్‌ పాల్‌ అనే నాయకుడు కొద్ది రోజుల క్రితమే బయటికి వచ్చారు. అయితే ఆయన బీజేపీలో చేరబోతున్నట్లు ముందు నుంచే పలు అంచనాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగా గురువారం నాటి సమావేశంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరడానికి గల కారణాలను ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాకుండా టీఎంసీపై మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇలా మాట్లాడుతున్న తరుణంలోనే ‘‘మొదట నేను బీజేపీలోనే ఉన్నాను. కానీ లెఫ్ట్‌ ప్రభుత్వాన్ని ఓడించడం కోసం 2005లో టీఎంసీలో చేరాను. అప్పటి నుంచి ఆ పార్టీలో ఉండి తప్పు చేశాను. టీఎంసీ కార్యకర్తగా నాకు అంటుకున్న పాపాల ప్రక్షాళన కోసం నాకు నేనే ఓ చిన్న శిక్ష వేసుకుంటున్నాను’’ అని గుంజీలు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement
Advertisement