Abn logo
Aug 4 2020 @ 21:10PM

సుశాంత్ కేసులో తనపై వస్తున్న వార్తలపై మంత్రి ఆదిత్య థాక్రే కీలక వ్యాఖ్యలు

ముంబై: బాలీవుడ్ నటుడు యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి మహారాష్ట్ర సీఎం కుమారుడు, మంత్రి ఆదిత్య థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్ ‌రాజ్‌పుత్ కేసులో నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సినీ పరిశ్రమలో ఉన్నవారితో తనకు పరిచయాలున్నాయని, అదేం నేరం కాదని ఆదిత్య చెప్పుకొచ్చారు.


తాను హిందూ హృదయసామ్రాట్ బాలాసాహెబ్ థాక్రే మనవడినని, మహారాష్ట్ర గౌరవానికి, శివసేన, థాక్రే కుటుంబానికి మచ్చ తెచ్చే ఏ పని తాను చేయనని ఆదిత్య థాక్రే వ్యాఖ్యానించారు. సుశాంత్ చనిపోవడానికి, తనకూ ఎటువంటి సంబంధం లేదని, శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

Advertisement
Advertisement
Advertisement