నాష్‌విల్లే పేలుడు ఘటన.. అనుమానితుడి వీడియో విడుదల

ABN , First Publish Date - 2020-12-29T19:09:00+05:30 IST

క్రిస్మస్ పర్వదినాన అమెరికాలో భారీ పేలుడు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్న ఓ వ్యక్తి ఫొటోలను నాష్‌విల్లే పోలీసులు విడుదల చేశారు.

నాష్‌విల్లే పేలుడు ఘటన.. అనుమానితుడి వీడియో విడుదల

నాష్‌విల్లే: క్రిస్మస్ పర్వదినాన అమెరికాలో భారీ పేలుడు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్న ఓ వ్యక్తి ఫొటోలను నాష్‌విల్లే పోలీసులు విడుదల చేశారు. ఘటనాస్థలిలో రికార్డైన సీసీటీవీ వీడియోలో అనుమాతుడిగా భావిస్తున్న ఓ వ్యక్తి.. పేలుడికి కొన్ని క్షణాల ముందు అక్కడే ఉండడం వీడియోలో ఉంది. ఇక శుక్రవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో టెన్నెసీ రాష్ట్రంలోని నాష్‌విల్లేలో ఈ పేలుడు సంభవించింది. నాష్‌విల్లేలోని లోయర్ బోర్డ్‌వే సమీపంలో నిలిపి ఉంచిన ఆర్‌వీ వాహనంలో దుండగులు అమర్చిన బాంబు పేలినట్లు పోలీసులు గుర్తించారు. 


కాగా.. బార్లు, రెస్టారెంట్లు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో పేలుడు ఉదయం సమయంలో జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే, పేలుడు ధాటికి సమీపంలోని వాహనాలు, భవనాలు ధ్వంసమయ్యాయి. అలాగే ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. అయితే, ఘటనాస్థలిలో మానవ అవశేషాలు కనిపించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో అనుమానితుడిగా భావిస్తున్న63 ఏళ్ల వ్యక్తే చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 



Updated Date - 2020-12-29T19:09:00+05:30 IST