గుత్తి ఎస్‌ఐపై సస్పెన్షన వేటు

ABN , First Publish Date - 2021-10-17T05:49:40+05:30 IST

జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న ఎస్‌ఐపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.

గుత్తి ఎస్‌ఐపై సస్పెన్షన వేటు

అనంతపురం క్రైం, అక్టోబరు 16: జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న ఎస్‌ఐపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. గుత్తి ఎస్‌ఐగా పనిచేస్తున్న జి. సుధాకర్‌యాదవ్‌ను సస్పెండ్‌ చేస్తూ అనంతపురం రేంజ్‌ డీఐజీ క్రాంతిరా ణా టాటా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎస్‌ఐ జి.సుధాకర్‌ యాదవ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.


వర్క్‌ ఇనస్పెక్టర్‌ మాధవరెడ్డిపై కూడా..

అనంతపురం కార్పొరేషన, అక్టోబరు 16: యువతులను వంచించిన కేసులో అ రెస్టయిన నగరపాలక సంస్థ వర్క్‌ఇనస్పెక్టర్‌ మాధవరెడ్డిని సస్పెండ్‌ చేస్తూ సంస్థ కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి శ నివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎ స్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టయిన మాధవరెడ్డిపై దిశ డీఎస్పీ నుంచి అం దిన నివేదిక ఆధారంగా సస్పెండ్‌ చేసినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మ రో నెలలో రిటైర్‌ కానున్న మాధవరెడ్డి మొత్తం మూడుసార్లు సస్పెండ్‌ అ య్యాడు.

Updated Date - 2021-10-17T05:49:40+05:30 IST