విద్యార్థులు గాయపడిన ఘటనలో హెచ్ఎం, సీఆర్పీల సస్పెన్షన్

ABN , First Publish Date - 2021-09-02T01:29:04+05:30 IST

పాఠశాల పెచ్చులూడి విద్యార్థులు గాయపడిన ఘటనలో ఎస్ఎస్ఏ ఏఈ, పాఠశాల హెచ్ఎం, సీఆర్పీ

విద్యార్థులు గాయపడిన ఘటనలో హెచ్ఎం, సీఆర్పీల సస్పెన్షన్

కర్నూలు:  పాఠశాల పెచ్చులూడి విద్యార్థులు గాయపడిన ఘటనలో ఎస్ఎస్ఏ ఏఈ, పాఠశాల హెచ్ఎం, సీఆర్పీల సస్పెండ్ చేస్తూ  డీఈవో సాయిరాం ఉత్తర్వులు జారీ చేశారు. సి.బెళగల్ మండలంలోని బూరాన్ దొడ్డి ప్రాధమిక పాఠశాలను డీఈవో సాయిరాం పరిశీలించారు. నిన్న స్లాబ్ పెచ్చులూడి విద్యార్థులకు గాయాలు కావడంపై డీఈవో స్పందించారు. ఘటనకు సంబంధించి ఎస్ఎస్ఏ ఏఈ, పాఠశాల హెచ్ఎం, సీఆర్పీల సస్పెండ్ చేసారు. సమాచారం అందించడంలో నిర్లక్ష్యం చేసిన ఎంఇఓపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని  డీఈవో సాయిరాం తెలిపారు. 




సి.బెళగల్‌ మండలంలోని బూరందొడ్డి ప్రాథమిక పాఠశాలలో గది పైకప్పు పెచ్చులూడి ఓ విద్యార్థికి గాయాలయిన విషయం తెలిసిందే. మంగళవారం యథావిధిగా స్కూలు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఐదో తరగతి గది పైకప్పు పెచ్చులూడింది. దీంతో మహేంద్ర అనే విద్యార్థి తలపై పెచ్చులు పడడంతో గాయాలయ్యాయి. ఆ సమయంలో గదిలో 25 మంది విద్యార్థులు ఉన్నారు. మహేంద్రను తల్లిదండ్రులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. తలకు ఐదు కుట్లు పడినట్లు తండ్రి సుంకన్న తెలిపారు. నాడు-నేడు కింద చేపట్టిన పాఠశాల పైకప్పు పనులు చేయకపోవడం వల్లే ఇలా జరిగిందని సుంకన్న ఆరోపించారు. పాఠశాల ఉపాధ్యాయుడు కృపానందంను వివరణ కోరగా.. రెండు నెలల క్రితం మొదటి దశ నాడు-నేడు కింద పైకప్పు పనులు చేశారని తెలిపారు.

Updated Date - 2021-09-02T01:29:04+05:30 IST