కీచక ప్రధానోపాధ్యాయుడుపై సస్పెన్షన్ వేటు

ABN , First Publish Date - 2021-03-04T02:14:06+05:30 IST

విద్యార్థినులను వేధిస్తున్న కీచక ప్రధానోపాధ్యాయుడుపై

కీచక ప్రధానోపాధ్యాయుడుపై సస్పెన్షన్ వేటు

కామారెడ్డి: విద్యార్థినులను వేధిస్తున్న కీచక ప్రధానోపాధ్యాయుడుపై కలెక్టర్ శరత్ వేటు వేశారు. ప్రభుత్వ బాలుర పాఠశాల హెచ్‌ఎం దీప్లా రాథోడ్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వలు జారీ చేశారు. ఆన్‌లైన్‌ క్లాస్‌ల పేరుతో విద్యార్థినులను హెచ్‌ఎం రాథోడ్ వేధిస్తున్న వైనంపై ఏబీఎన్ కథనాలను ప్రసారం చేసింది. ఈ కథనాలకు స్పందించిన కలెక్టర్ శరత్ ప్రధానోపాధ్యాయుడుపై సస్పెన్షన్ వేటు  వేశారు. ఈ ఘటనపై విచారణ బాధ్యతలను డీఆర్వోకు కలెక్టర్ శరత్ అప్పగించారు. 




జిల్లాలో విద్యార్థులను వేధిస్తున్న కీచక ప్రధానోపాధ్యాయుడి భాగోతం వెలుగులోకి వచ్చింది. కరోనా కాలంలో ఆన్‌లైన్‌ క్లాస్‌ల పేరుతో విద్యార్థినుల నంబర్లను హెచ్‌ఎం దీప్లా రాథోడ్ సేకరించాడు. విద్యార్థినులకు వీడియోకాల్‌ చేసి అందాలు చూపించాలని హెచ్‌ఎం వేధింపులకు గురి చేశాడు. పాఠశాలలు తిరిగి ఈ మధ్యనే పున:ప్రారంభమయ్యాయి. డ్యాన్స్‌ నేర్పుతానంటూ విద్యార్థినులను గదిలోకి తీసుకెళ్లి పిల్లలతో హెచ్‌ఎం అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న హెచ్‌ఎం వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ కీచక ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. 

Updated Date - 2021-03-04T02:14:06+05:30 IST