రేగులగూడెం సర్పంచ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

ABN , First Publish Date - 2021-10-12T05:30:00+05:30 IST

రేగులగూడెం సర్పంచ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

రేగులగూడెం సర్పంచ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

కాటారం, అక్టోబరు 12: మండలంలోని రేగులగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్‌ దోమ రాహుల్‌పై తాత్కాలికంగా విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు, ఎంపీవో మల్లికార్జున్‌రెడ్డి మంగళవారం తెలిపారు. అధికారులను దుర్భాషలాడటం, పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలపై జూలైలో రాహుల్‌ను సస్పెండ్‌ చేసినట్టు పేర్కొన్నారు.  అభివృద్ధి పనులు చేయడంతో పాటు సత్ప్రవర్తనతో మెలుగుతానని రాహుల్‌ చెప్పడంతో సస్పెన్షన్‌ను ఎత్తివేసి సర్పంచ్‌గా కొనసాగడానికి కలెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారని ఎంపీడీవో తెలిపారు.


Updated Date - 2021-10-12T05:30:00+05:30 IST