హైదరాబాద్: సీఎం కేసీఆర్ శాసనమండలి చైర్మన్ పదవి ఊరకే ఇవ్వలేదని బీజేపీ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కష్టపడినందుకే ఆ పదవి వచ్చిందని తెలిపారు. కావాల్సినంత మెజార్టీ ఉన్నప్పటికీ ఇతర పార్టీల నేతలను చేర్చుకుని కేసీఆర్ తప్పు చేశారన్నారు. కేసీఆర్ ఇతర పార్టీలవారికి ఇచ్చిన గౌరవం.. తనకివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు ధైర్యం ఎవరో ప్రజలు గమనించాలని కోరారు. మోదీ గుండె ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటున్నారని స్వామిగౌడ్ ప్రశంసించారు.