వైభవంగా శ్రీవారి పులిపార్వేట ఉత్సవం

ABN , First Publish Date - 2021-01-16T06:36:28+05:30 IST

పట్టణంలో ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి పులిపార్వేట ఉత్సవం శుక్రవారం వైభవంగా జరి గింది. ఆలయంలో నిత్యకైంకర్యాల అనంతరం స్వామివారు పల్లకీలో పులిపార్వేటకు బయల్దేరారు.

వైభవంగా శ్రీవారి పులిపార్వేట ఉత్సవం

కదిరి, జనవరి 15: పట్టణంలో ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి పులిపార్వేట ఉత్సవం శుక్రవారం వైభవంగా జరి గింది. ఆలయంలో నిత్యకైంకర్యాల అనంతరం స్వామివారు పల్లకీలో పులిపార్వేటకు బయల్దేరారు. స్వామివారు నేరుగా కదిరి కొండకు చేరుకున్నారు. అక్కడ శాస్త్రోక్తంగా శ్రీదేవీ, భూదేవీ సమేతుడైన స్వామివారికి ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో ఉన్న పాలపొంగుల ఉట్టి వద్దకు చేరుకున్నారు. పాలపొంగుల అనంతరం స్వామివారు రైల్వేస్టేషన్‌ సమీ పంలోకి వచ్చారు. అక్కడ పార్వేట ఉత్సవాన్ని అర్చకులు ప్రారంభించారు. కుందేళ్లను భక్తుల సమక్షంలో స్వామి వారికి చూపి కిందకు వదిలారు. పార్వేట అనంతరం ప క్కనే ఉన్న ఉట్టిలో స్వామివారు పూజలు అందుకున్నారు. అక్కడ నుంచి రాయచోటిరోడ్డులో ఉన్న ఉట్టివద్దకు చేరుకుని అక్కడ పూజలు అందుకున్నారు. అనంతరం స్వామి వారు అశ్వవాహనంలో తిరిగి ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని కదిరి ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి,  ఆలయ చైౖర్మెన్‌ రెడ్డెప్పశెట్టి, ఇతర భక్తులు, ఆలయ ధర్మ కర్తలు దర్శించుకున్నారు.  డీఎస్పీ భవ్యకిశోర్‌ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. 


పార్వేటకు వేలాది మంది భక్తులు 

శ్రీవారి పార్వేట ఉత్సవాన్ని తిలకించడానికి వయోభేదం లేకుండా వేలాది మంది రైల్వేస్టేషన్‌ వద్దకు చేరుకున్నారు.  సంక్రాంతి చివరిరోజు కనుమ సందర్భంగా ఈ పర్వేట ఉత్సవాన్ని రైల్వేస్టేషన్‌ వద్ద నిర్వహించడం ఆనవాయితీ.  పార్వేట ఉత్సవంలో కుందేళ్లను వదలడంతో వాటిని పట్టు కోవటానికి పురుషులు ఒకరిమీద ఒకరు పడి పోటీ పడ్డా రు. కుందేలును దక్కించుకోవడం వల్ల మేలు జరుగు తుందనేది భక్తుల నమ్మకం. 

Updated Date - 2021-01-16T06:36:28+05:30 IST