వైరల్ వీడియో: మాస్కు పెట్టుకోని మహిళకు ఝలకిచ్చిన పక్షి!

ABN , First Publish Date - 2020-09-14T18:27:00+05:30 IST

మాస్కు పెట్టుకోని వారికి ఈ హంస ఝలకివ్వగలదు

వైరల్ వీడియో: మాస్కు పెట్టుకోని మహిళకు ఝలకిచ్చిన పక్షి!

ఇంటర్నెట్ డెస్క్: మాస్కు మన జీవితంలో ఓ భాగం అవుతందని కరోనా సంక్షోభం మొదట్లోనే నిపుణులు చెప్పారు. అన్నట్టుగానే.. ప్రస్తుతం అనేక మంది నిత్యం మాస్కులు పెట్టుకుని దర్శనమిస్తున్నారు. దీంతో ఒక్కోసారి తెలిసిన వాళ్లను కూడా గుర్తు పట్టలేని పరిస్థితి నెలకొంది. అయితే కొంత మంది మాత్రం ఇప్పటికీ కరోనా అంటే బొత్తిగా భయం లేనట్టు ప్రవర్తిస్తున్నారు. మాస్కు పెట్టుకోవాలన్న విషయాన్ని గాలి కొదిలేస్తున్నారు. ఎవరూ ఎంత చెప్పినా తమ తీరే వేరు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు.


అయితే ఓ హంస ఇటువంటి వారికి చక్కని గుణపాఠం చెప్పగలదని నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఓ వీడియోను వారు ప్రస్తావిస్తున్నారు. ఈ వీడియోలో ప్రకారం.. ఓ హంసను చూసి ముచ్చపడ్డ మహిళ దానిని దగ్గరగా చూసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే.. ఆ సమయంలో ఆమె నోటిపై ఉన్న మాస్కు పక్కకు తొలగి ఉంటుంది. 


ఇంతలో పక్షి ఆమెను ముక్కుతో పొడిచే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో.. మహిళ నోటి కింద ఉన్న మాస్కు ఒక్కసారిగా సరైన స్థితిలోకి వచ్చేస్తోంది. ఈలోపు.. పక్షి దాడితో ఖంగు తిన్న మహిళ ఒక్కసారిగా వెల్లకెలా పడిపోతోంది. ఈ వీడియోలో చూసిన నెటిజన్లు.. పక్షి మంచి గుణ పాఠమే చెప్పిందంటూ కామెంట్ చేస్తున్నారు. మాస్కు పెట్టుకోని వారికి ఈ పక్షితో పాఠాలు చెప్పించాలంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. 



Updated Date - 2020-09-14T18:27:00+05:30 IST