యాంటీ హిందూ, పాకిస్థానీలకు మాత్రమే ఇష్టం అంటూ స్వర భాస్కర్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

బాలీవుడ్ సెలెబ్రిటీలందరూ ఒకరి తర్వాత మరొకరు ట్రోల్స్‌కు గురవుతున్నారు. ఆలియా భట్, మిరా రాజ్‌పుత్, కాజోల్, కరీనా కపూర్‌ల ట్రోల్స్‌ను మరచిపోకముందే తాజాగా మరొకరు దీని బారిన పడ్డారు. తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పినందుకు సోషల్ మీడియా యూజర్స్ ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. 


మమతా బెనర్జీ ఈ మధ్య ముంబైకి వచ్చింది. వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులతో మమత సమావేశమయింది. ఈ మీటింగ్‌లో స్వర భాస్కర్ మాట్లాడింది. ‘‘ భారత్‌లోని ఒక రాష్ట్రం వేర్వేరు రకాల చట్టాలను ప్రయోగించి సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులను అవమనానికి గురి చేస్తుంది. స్వాతంత్ర్యంగా కథలను చెప్పకుండా వారిపై అనేక రకాల చట్టాలను ప్రయోగిస్తుంది. దీంతో వారి జీవితం, కెరీర్‌కు ఇబ్బంది ఎదురవుతుంది. మున్వర్ ఫారూఖీ, అదితి మిట్టల్ లాంటి వారిని కొన్ని అతివాద సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఒక మతానికి చెందిన వారి విశ్వాసాలను కించపరిచాడని మున్వర్‌ను ఒక నెల పాటు జైలులో కూడా ఉంచారు ’’ అని స్వర భాస్కర్ చెప్పింది. 


స్వర భాస్కర్ అభిప్రాయాలను విన్న అనంతరం మమతా బెనర్జీ ఆమెను మెచ్చుకుంది.  రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చింది. కానీ, నెటిజన్లు మాత్రం ఆమె మాటలతో అసంతృప్తి చెందారు. ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ‘‘ ఒమైక్రాన్ వేరియంట్ స్వర భాస్కర్ రూపంలో ఎప్పుడో భారత్ కు వచ్చింది ’’ అని ఒక నెటిజన్ ట్రోల్  చేశాడు. ‘‘ యాంటీ హిందూ’’ అని మరో నెటిజన్ తన స్పందనను తెలిపాడు. ‘‘ మానసికంగా వికలాంగురాలు ’’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘ యాంటీ హిందూ అయిన స్వర భాస్కర్ పాకిస్థానీలకు మాత్రమే ఇష్టం’’ అని ఒక సోషల్ మీడియా యూజర్ స్పందించాడు. 

Advertisement

Bollywoodమరిన్ని...