అమెరికాలో కళాతపస్వికి స్వరాభిషేకం

ABN , First Publish Date - 2021-03-02T13:48:42+05:30 IST

విశ్వనాథ్‌ జన్మదినమహోత్సవం అంతర్జాలంలో

అమెరికాలో కళాతపస్వికి స్వరాభిషేకం

హైదరాబాద్/చిక్కడపల్లి : డా.కె.విశ్వనాథ్‌ జన్మదినమహోత్సవం అంతర్జాలంలో గాయని శారద ఆకునూరి- అమెరికా, వంశీ ఇంటర్నేషనల్‌- ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘ఆపద్బాంధవుడు’ చిత్ర కథానాయకి మీనాక్షిశేషాద్రి, ‘ఉండమ్మా బొట్టుపెడతా’ కథానాయకి జమునారమణారావు, సూత్రధారులు ప్రధానపాత్రధారి మురళీమోహన్‌, ‘సిరిసిరిమువ్వ’, ‘శుభోదయం’, ‘ఓ సీతకథ’, ‘సీతామాలక్ష్మి’ వంటి చిత్రాలలో కథానాయకుడిగా నటించిన చంద్రమోహన్‌, హీరోయిన్‌ రోజారమణి, నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కుమారులు రాజా తదితరులు మాట్లాడుతూ విశ్వనాథ్‌ దర్శకత్వ ప్రతిభను ప్రశంసించారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి గాయనీగాయకులు విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన చిత్రగీతాలను పాడారు. వంశీ రామరాజు మాట్లాడుతూ విశ్వనాథ్‌ను ఎన్నోసార్లు వంశీబర్కిలీ అవార్డ్స్‌ ద్వారా సత్కరించామన్నారు. 

Updated Date - 2021-03-02T13:48:42+05:30 IST