Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆచార్యులు ఎవరైనా ఆదిశంకరాచార్యుల తర్వాతే...

విశాఖపట్టణం: కేదార్‍నాధ్‌లో ఆదిశంకరుని విగ్రహావిష్కరణ ఉత్తేజాన్నిస్తోందని, దేశ ఔన్నత్యాన్ని చాటుతోందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర పేర్కొన్నారు. భారతదేశంలో ఎన్ని మతాలు వచ్చినా హిందూ ధర్మం నిలబడిందంటే అది ఆదిశంకరాచార్యులు భిక్షేనని సింహాచలంలో నక్షత్ర వనాన్ని ప్రారంభించిన సందర్భంగా మీడియాతో స్వరూపానందేంద్ర వ్యాఖ్యానించారు. ఆచార్యులు ఎవరైనా ఆదిశంకరాచార్యుల తర్వాతేనన్న స్వరూపానంద... ప్రతి ఇంటా ఆదిశంకరాచార్యుల వారిని కీర్తించాలని పిలుపునిచ్చారు. కేదార్‍నాథ్ పునరుద్ధరణకు పూనుకున్న ప్రధాని మోడీ అభినందనీయులంటూ హరిద్వార్ నుంచి గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్‌లకు రోడ్లు వేసి దేశానికి అంకితమివ్వడం అద్భుతమైన కార్యక్రమమని ప్రశంసించారు.

Advertisement
Advertisement