నాసా వైపు నా ప్రయాణం అలా మొదలైంది.. బైడెన్‌తో స్వాతి!

ABN , First Publish Date - 2021-03-05T21:09:17+05:30 IST

నాసా ప్రయోగించిన ‘పర్సివియరన్స్’ రోవర్ సేఫ్‌గా ల్యాండ్ అవ్వడంలో కీలక పాత్ర పోషించిన భారత సంతతి మహిళ స్వాతి మోహన్.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ వైపు తన అడుగులు పడిన క్రమాన్ని అ

నాసా వైపు నా ప్రయాణం అలా మొదలైంది.. బైడెన్‌తో స్వాతి!

వాషింగ్టన్: నాసా ప్రయోగించిన ‘పర్సివియరన్స్’ రోవర్ సేఫ్‌గా ల్యాండ్ అవ్వడంలో కీలక పాత్ర పోషించిన భారత సంతతి మహిళ స్వాతి మోహన్.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ వైపు తన అడుగులు పడిన క్రమాన్ని  అగ్రరాజ్య అధినేత జో బైడెన్‌కు వివరించారు. టీవీ షో ద్వారా ప్రేరణ పొంది.. నాసా వైపు అడుగులు వెసినట్టు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. ‘పర్సివియరన్స్’ రోవర్ అంగారకుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన నేపథ్యంలో.. నాసా టీమ్‌లో బైడెన్ వర్చువల్‌గా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నాసా టీమ్‌కు బైడెన్ కంగ్రాట్స్ చెప్పారు.


అనంతరం రోవర్ సేఫ్‌గా అంగారకుడిపై ల్యాండ్ అవ్వడంలో ముఖ్య పాత్ర పోషించిన స్వాతి మోహన్‌తో అమెరికా అధ్యక్షుడు ప్రత్యేకంగా సంభాషిస్తూ భారతీయ అమెరికన్లపై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో బైడెన్‌కు ధన్యవాదాలు తెలిపిన స్వాతి మోహన్.. నాసా వైపు తన ప్రయాణ క్రమాన్ని బైడెన్‌కు వివరించారు. చిన్న తనంలో ‘స్టార్ ట్రెక్’ అనే టీవీ షో మొదటి ఎపిసోడ్ చూసి.. అంతరిక్షానికి సంబంధించిన అంశాలపై ఆసక్తి పెంచుకున్నానని చెప్పారు. ఈ క్రమంలో కొత్త జీవితాన్ని అందులోనే వెతుక్కోవాలని నిర్ణయించుకునట్టు తెలిపారు. ప్రస్తుతం నాసాలో పని చేస్తున్నందుకు ఆనందంగా ఉందని బైడెన్‌కు వివరించారు. 


Updated Date - 2021-03-05T21:09:17+05:30 IST