నేడే ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2022-02-18T05:51:11+05:30 IST

టీఆర్‌ఎస్‌ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.

నేడే ప్రమాణ స్వీకారం
వరాలు వెల్లడిస్తున్న నాయకులు

- టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య బాధ్యతల స్వీకరణ 

- హాజరుకానున్న మంత్రి కేటీఆర్‌

- ఘనంగా ఏర్పాట్లు 

సిరిసిల్ల, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సిరిసిల్ల శ్రీ సాయిమణికంఠఫంక్షన్‌ హాల్‌లో జరిగే ప్రమాణ స్వీకారం, బాధ్యత స్వీకరణ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ అధ్యక్షుడు పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు రాను న్నారు. ఇందుకోసం భారీ బైక్‌ ర్యాలీతో పాటు సిరిసిల్ల జిల్లా కేంద్రాన్ని గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలతో గులాబీ మయంగా మారుస్తున్నారు. గురువారం సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, జిల్లా అధ్యక్షుడు తోట అగయ్యలు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడిం చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పరిపాలన దక్షత కలిగిన కేసీఆర్‌ తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రపంచ దేశాలనే అకర్షించాయని అన్నారు. హైదరాబాద్‌ నగరం, తెలంగాణ వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అతి వేగంగా 33 జిల్లాలను ఏర్పాటు చేసి ఒకే చోట ప్రజలకు సేవలు అందే విధంగా కలెక్టరేట్‌ల నిర్మాణాలు చేశారని అన్నారు. మంత్రి కేటీఆర్‌ పనితీరుకు అభివృద్ధి జరుగుతున్న తీరే నిదర్శనమని అన్నారు. శుక్రవారం సిరిసిల్ల, రగుడు వద్ద మణికంఠ ఫంక్షన్‌హాల్‌లో జిల్లా అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం, జిల్లా స్థాయి పార్టీ కార్యకర్తల విసృత సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాకు వస్తున్న మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు 10.30 గంటల వరకు కార్యకర్తలు, నాయకులు తంగళ్లపల్లి బ్రిడ్జి వద్దకు బైక్‌ ర్యాలీలో పాల్గొనడా నికి రావాలని అన్నారు. సిరిసిల్ల గాంధీచౌక్‌, అంబేద్కర్‌ చౌరస్తా, నేతన్న చౌక్‌ మీదుగా డప్పుచప్పుళ్లు, ఒగ్గుడోలు కళాకారుల నృత్యాలతో ఫంక్షన్‌హాల్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మధ్యాహ్నాం 2 గంటలకు సమా వేశ కార్యక్రమం బాధ్యతల స్వీకరణ ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళచక్రపాణి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్‌, కోనరావుపేట ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌, పట్టణ కార్యదర్శి మ్యాన రవి, ఉపాధ్యక్షుడు సంజీవ్‌, బొల్లి రామ్మోహన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-18T05:51:11+05:30 IST