Abn logo
Sep 25 2021 @ 00:09AM

అట్టహాసంగా ఎంపీపీల ప్రమాణ స్వీకారం

ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి, మార్కాపురం ఎంపీపీ పోరెడ్డి అరుణా చెంచిరెడ్డిలను సత్కరిస్తున్న వైసీపీ నాయకులు

ఏకగ్రీవంగా అభ్యర్థుల ఎంపిక

మార్కాపురం, సెప్టెంబరు 24: మార్కాపురం ఆరవ మండలాధ్యక్షు రాలిగా పోరెడ్డి అరుణ ఎన్నికయ్యారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియను రిటర్నింగ్‌ అధికారి డాక్టర్‌ బాలూ నాయక్‌ నిర్వహించారు. తొలుత బొడిచెర్లకు చెందిన షేక్‌ రఫీ కో ఆప్షన్‌ సభ్యునిగా ఏకగ్రీవమయ్యారు. ఆతర్వాత ఎంపీపీగా పోరెడ్డి అరుణ, ఉపా ధ్యక్షురాలిగా దేవెండ్ల లక్షమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితోప టు ఎంపీటీసీలతో ఎంపీడీవో టి.హనుమంతరావు ప్రమాణ స్వీకారం చేయిం చారు. ఈసందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ నూతన ప్రజాప్రతినిధులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా పనిచేయాలన్నారు. నూతన ఎంపీపీ పోరెడ్డి అరుణను మున్సిపల్‌ చైర్మన్‌ చిల్లంచెర్ల బాలమురళీకృష్ణ, కౌన్సిలర్‌ డాక్టర్‌ చెప్పల్లి కనకదుర్గ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వెన్నా హనుమారెడ్డి, సంయుక్త కార్యదర్శి మీర్జా షంషీర్‌ అలీబేగ్‌ మున్సిప ల్‌ మాజీవైస్‌ చైర్మన్‌ షేక్‌ షెక్షావలి, ఎంపీడీవో టి.హనుమంతరావు, కా ర్యాలయ సిబ్బంది తదితరులు పూలమాలలు, శాలువాలతో అభినందనలు తెలిపారు.

మార్కాపురం ఎంపీపీ ఎన్నిక కార్యక్రమంలో ఇద్దరు ఎంపీటీసీలు గైర్హా జరు కావడం చర్చనీయాంశమైంది. ఎంపీపీ పదవిని ఆశించి  విఫలమైన తిప్పాయపాలెం ఎంపీటీసీ బండి లక్ష్మీదేవి ఒకరు కాగా, గోగులదిన్నె ఎం పీటీసీ కంది సరస్వతి మరొకరు. గోగులదిన్నె సరస్వతి గైర్హాజరుపై నిర్దిష్టమైన కారణం లేకపోవడం చర్చనీయాంశమైంది. 

తర్లుపాడు ఎంపీపీగా భూలక్ష్మి

తర్లుపాడు, సెప్టెంబరు 24: తర్లుపా డు మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా సూరెడ్డి భూలక్ష్మి, ఉపాఽధ్యక్షురాలిగా కూ ర్మారాయిని పుణ్యావతమ్మను ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు. ముందుగా భూలక్ష్మి ఇంటి వద్ద నుంచి మార్కాపురం ఎమ్మె ల్యే నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా తర్లుపాడు బస్టాండ్‌ సెం టర్‌కు చేరుకొని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో ఎంపీపీగా సూరెడ్డి భూలక్ష్మి, ఉపాధ్యక్షురాలుగా కూర్మారాయిని పుణ్యావతమ్మ, కోఆప్షన్‌ సభ్యుడిగా షేక్‌ అక్బర్‌ వలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా భూలక్ష్మీని ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, మార్కాపురం మైనార్టీ నాయకులు షంషీర్‌ అలీబేగ్‌, పిన్నిక లక్ష్మీ ప్రసాద్‌ యాదవ్‌ అభినందించారు. 

త్రిపురాంతకం ఎంపీపీగా సుబ్బారెడ్డి 

త్రిపురాంతకం, సెప్టెంబరు 24: నూతన మండలాధ్యక్షుడిగా  కోట్ల సుబ్బారెడ్డి ఎన్నికయ్యారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ స మావేశ మందిరంలో శుక్రవారం ఎంపీపీ, వై స్‌ ఎంపీపీ, కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలను ఆ ర్‌వో కేఐ.సుదర్శనరాజు నిర్వహించారు. సీపీ ఐ నుంచి ఎం.నయీంబేగ్‌ ఒక్కరే కో-ఆప్షన్‌ సభ్యుడి కోసం నామినేషన్‌ దాఖలు చేయ గా  ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఆర్‌వో ప్రకటించారు. అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో  ఎంపీపీగా కోట్ల సుబ్బారెడ్డి, వైస్‌ ఎంపీపీగా ఆళ్ళ సుబ్బమ్మను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్‌ చేతులమీదుగా నూతన ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలు ధ్రువీకరణ పత్రాలను అందుకున్నారు. 

ఎర్రగొండపాలెం ఎంపీపీగా కిరణ్‌గౌడ్‌

ఎర్రగొండపాలెం, సెప్టెంబరు 24 : ఎర్రగొండపాలెం  మండల పరిషత్‌ అధ్యక్షులుగా  దొంతా కి రణ్‌ గౌడ్‌, ఉపాధ్యక్షులుగా వూనా ది బాలమ్మ, కోఆప్షన్‌ సభ్యుడిగా సన్నెపోగు విజయకుమార్‌ ఏకగ్రీవంగా  ఎన్నికైనట్లు  ఎన్నికల రి టర్నింగ్‌ అధికారి సాయికుమార్‌  తెలిపారు. వీరితోపాటు ఎంపీటీసీ లతో ప్రమాణ స్వీకారం చేయించారు.  ఎంపీపీ దొంతా కిరణ్‌గౌడ్‌కు వైసీపీ నాయకులు ఘనస్వాగతం పలికి మండలపరిషత్‌ కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ సెంటర్‌ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

పెద్దదోర్నాల ఎంపీపీగా పద్మజ

పెద్దదోర్నాల, సెప్టెంబరు 24: ప్రభుత్వం ప్రవేశ పెట్టి న సంక్షేమ పథకాలను పా రదర్శకంగా ప్రజలకు అం దించి మండల అభివృద్ధికి తోడ్పడాలని రాష్ట్ర విద్యాశా ఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నూతనంగా ఎంపికైన ఎం పీపీ, ఎంపీటీసీలు కో ఆ ప్షన్‌ సభ్యులతో రిటర్నింగ్‌ అధికారి రతన్‌బాబు ప్రమాణ స్వీకారం చేయించారు. మండల పరిషత్‌ అధ్యక్షులుగా గుమ్మా పద్మజ, ఉపాధ్యక్షులుగా పరుచూరి సురేఖ, కో ఆప్షన్‌ సభ్యులుగా పఠాన్‌ వహబ్‌ ఖాన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితోపాటు ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

రాచర్ల ఎంపీపీగా ఖాశీంబీ

రాచర్ల, సెప్టెంబరు 24: రాచర్ల ఎం పీపీగా షేక్‌ ఖాశీంబీ, వైస్‌ ఎంపీపీగా సుజాత, కోఆప్షన్‌ సభ్యులుగా షేక్‌ బాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్ర వారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగి న కార్యక్రమంలో ఎన్నికల అధికారి బి. వేణుగోపాల్‌ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ షేక్‌ ఇబ్రహీం ఖలీల్‌, ఎంపీడీవో సయ్యద్‌ మస్తాన్‌వలి, జడ్పీటీసీ సభ్యురాలు పగడాల దేవి పాల్గొన్నారు.

కొమరోలు ఎంపీపీగా అమూల్య

 కొమరోలు, సెప్టెంబరు24: కొమరోలు మండల పరిషత్‌ అద్యక్షులుగా కామూరి అమూల్య,  ఉపాధ్యక్షులుగా దూదేకుల నాగమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎన్నికల అధికారి జయరామయ్య, ఎంపీడీఓ శ్రీనివాసకుమార్‌ల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. కోఆప్షన్‌ సభ్యుడిగా  షేక్‌ ఖాశింపీరా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను ఘనంగా సన్మానించారు.  

కొమరోలు, సెప్టెంబరు 24: కొమరోలు మండల పరి షత్‌ అధ్యక్షురాలిగా కామూ రి అమూల్య,  ఉపాధ్యక్షురా లిగా దూదేకుల నాగమ్మ ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎ న్నికల అధికారి జయరామ య్య, ఎంపీడీఓ శ్రీనివాసకుమార్‌ల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. కోఆప్షన్‌ సభ్యుడిగా  షేక్‌ ఖాశింపీరా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను ఘనంగా సన్మానించారు. 

కంభం ఎంపీపీగా తులశమ్మ

కంభం, సెప్టెంబరు 24: కంభం ఎంపీపీగా చేగిరెడ్డి తులశమ్మ, వైస్‌ ఎంపీపీగా నల్లబోతుల రాంమూర్తి,  కోఆప్షన్‌ సభ్యునిగా సయ్యద్‌ సలీమ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో ఎన్నికల  అధికారి ఎన్‌.సురేష్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నరసయ్య, వైసీపీ సీనియర్‌ నాయకులు చేగిరెడ్డి లింగారెడ్డి, చేగిరెడ్డి ఓబులరెడ్డి, నెమలిదిన్నె చెన్నారెడ్డి,  కొత్తపల్లి శ్రీనివాసులు,  సయ్యద్‌ జాకీర్‌హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

పెద్దారవీడు ఎంపీపీగా పెద్దగురవయ్య

పెద్దారవీడు(మార్కాపురం), సెప్టెంబరు 24: పెద్దారవీడు మండలాధ్యక్షుడుగా బెజవాడ పెద్ద గు రవయ్య శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరిం చారు. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో జరిగిన ఎన్నికలో పెద్ద గురవయ్యను ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షురాలిగా  గుండారెడ్డి చిన్న యోగమ్మ, కో ఆప్షన్‌ సభ్యుడుగా షేక్‌ నూర్‌ అహమ్మద్‌(బుజ్జి)లను ఎన్నుకున్నారు.  ముఖ్య అతిథిగా మంత్రి సురేష్‌ పాల్గొని నూతన పాలక వర్గాన్ని అభినందించారు.  కార్యక్రమంలో జలవనరుల శాఖ డైరెక్టర్‌ దుగ్గెంపూడి వెంకటరెడ్డి, జడ్పీటీసీ యేరువ చలమారెడ్డి, మండల కన్వీనర్‌ పాలిరెడ్డి కృష్ణారెడ్డి, పెద్దారవీడు సర్పంచ్‌ దుగ్గెం చెన్నమ్మ, మండల నాయకులు ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి(డీలర్‌), కాసు వెంకటరెడ్డి, డి.వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

అర్థవీడు ఎంపీపీగా వెంకటరావు

అర్థవీడు (కంభం), సెప్టెంబరు 24: అర్థవీడు ఎంపీపీగా మేడూరి వెంకటరావు, వైస్‌ ఎంపీపీగా  చందా శ్రీప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో వీరబ్రహ్మాచారి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో చివరగా వచ్చిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు  వారిని అభినందించారు.

గిద్దలూరు ఎంపీపీగా లక్ష్మీదేవి

గిద్దలూరు టౌన్‌, సెప్టెంబరు 24: గిద్దలూరు ఎంపీపీగా కడప లక్ష్మీదేవి,  వైస్‌ ఎంపీపీగా బండారి నోవె ల్‌, కోఆప్షన్‌ సభ్యులుగా పఠాన్‌ స య్యద్‌ పీర్‌ఖాన్‌ ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. శుక్రవారం మండలపరిషత్‌ కార్యాలయంలో ఎన్నికల అధికారి సతీష్‌ వీరితో ప్రమాణ స్వీకారం చే యించారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఎంపీపీ కడప లక్ష్మీదేవి, ఆమె భర్త మాజీ ఎంపీపీ కడప వంశీధర్‌రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్మీదేవి మాట్లాడుతూ మండలంలోని ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా, గ్రామాలలో మౌలిక వసతులు కల్పించేలా కృషి చేస్తానని చెప్పారు. 

కొనకనమిట్ల ఎంపీపీగా మురళీకృష్ణ

కొనకనమిట్ల, సెప్టెంబరు 24: కొనకనమి ట్ల ఎంపీపీగా మోరబోయిన మురళీక్రిష్ణ, వైస్‌ ఎంపీపీగా జన్నీఫా, కోఆప్షన్‌ సభ్యుడిగా సయ్యద్‌ మౌలాలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. వీరితోపాటు సభ్యులతో ఎంపీడీవో ప్ర ద్యుమ్నకుమార్‌  ప్రమాణ స్వీకారం చేయిం చారు.   ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి సమక్షంలో ఎంపీపీ నియామక పత్రాన్ని మోరబోయిన మురళీక్రిష్ణకు ఎంపీడీవో అందజేశారు.  

బేస్తవారపేట ఎంపీపీగా ఓసూరారెడ్డి

బేస్తవారపేట, సెప్టెంబరు 24: బేస్తవారపేట  ఎంపీపీగా వేగినాటి ఓసూరారెడ్డి,  వైస్‌ ఎంపీపీగా దూ దెకుల ఖాజీమియా, కోఆప్షన్‌ సభ్యు లుగా షేక్‌ బషీర్‌ ఏకగ్రీవంగా ఎన్ని కయ్యారు. వీరితోపాటు ఎంపీటీసీల తో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీ కారం చేయించారు. ముఖ్య అతిథి గా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు పాల్గొన్నారు. కార్య క్రమంలో మండల ప్రత్యేకాధికారి బాలాజీనాయక్‌, ఎంపీడీవో కె.కవితాచౌదరి పాల్గొన్నారు.కొమరోలు, సెప్టెంబరు24: కొమరోలు మండల పరిషత్‌ అద్యక్షులుగా కామూరి అమూల్య,  ఉపాధ్యక్షులుగా దూదేకుల నాగమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కా ర్యాలయంలో ఎన్నికల అధికారి జయరామయ్య, ఎంపీడీఓ శ్రీనివాస కుమార్‌ల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. కోఆప్షన్‌ సభ్యుడిగా  షేక్‌ ఖాశింపీరా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను ఘనంగా సన్మానించారు.