Advertisement
Advertisement
Abn logo
Advertisement

చిలగడదుంప రైస్‌

కావలసినవి: బియ్యం - ఒక కప్పు, చిలగడదుంపలు - రెండు, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లికాడలు - రెండు, రెడ్‌ క్యాప్సికం - ఒకటి, బ్రకోలి - ఒకటి, క్యారెట్‌ - రెండు, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు - తగినంత. 


తయారీ విధానం: ముందుగా అన్నం వండి సిద్ధంగా ఉంచుకోవాలి. చిలగడదుంపలు పొట్టు తీసి ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి. స్టవ్‌ పైపాన్‌ పెట్టి నూనె వేసి కాస్త  వేడి అయ్యాక చిలగడదుంపలు వేసి వేగించాలి. ముదురు గోధుమ రంగులోకి మారే వరకు వేగించాలి. తరువాత కొద్దిగా ఫ్రైసాస్‌ వేసి కలపాలి. ఉల్లికాడలు, రెడ్‌ క్యాప్సికం, బ్రకోలి, క్యారెట్‌ ముక్కలు వేయాలి. కూరగాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేగించాలి. ఇప్పుడు అన్నం వేసి కలపాలి. తగినంత ఉప్పు వేయాలి. చివరగా కొత్తిమీర వేసి వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.పటిశప్త ఉందియువెజ్‌ లాలీపాప్‌చైనీస్‌ ఫైవ్‌ స్పైస్‌ రైస్‌పెరుగు శాండ్‌విచ్‌కశ్మీరీ కహ్వా టీపనీర్‌ వెర్మిసెల్లీ బాల్స్‌చిల్లీ-ఆనియన్‌ క్రాకర్స్‌పత్తర్‌ కా ఘోష్‌లేడీ ఫింగర్‌ (బిస్కెట్‌)
Advertisement

నవ్య మరిన్ని