చిలగడదుంప సూప్‌

ABN , First Publish Date - 2021-03-06T17:47:31+05:30 IST

చిలగడదుంపలు - రెండు, కొబ్బరినూనె - రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - రెండు, అల్లం ముక్క - కొద్దిగా,

చిలగడదుంప సూప్‌

కావలసినవి: చిలగడదుంపలు - రెండు, కొబ్బరినూనె - రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - రెండు, అల్లం ముక్క - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - అర టీస్పూన్‌, వెజిటబుల్‌ స్టాక్‌ - రెండు కప్పులు, కొబ్బరిపాలు - అర కప్పు, ఉల్లికాడలు - రెండు.


తయారీ విధానం: చిలగడదుంపల పొట్టు తీసి ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి. తరువాత అల్లం, వెల్లుల్లి రెబ్బలు, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి మరికాసేపు వేగించాలి. ఇప్పుడు చిలగడదుంపల ముక్కలు వేసి కలియబెట్టాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఐదునిమిషాల పాటు వేగించాలి. తరువాత వెజిటబుల్‌ స్టాక్‌ పోసి మూత పెట్టి ఉడికించాలి. చిలగడదుంపలు మెత్తగా ఉడికిన తరువాత స్టవ్‌పై నుంచి దింపాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి బ్లెండ్‌ చేయాలి. కొబ్బరి పాలు పోసి మరోసారి పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో పోసి కాసేపు ఉడికించాలి. రుచికి తగినంత ఉప్పు వేయాలి. మిరియాల పొడి చల్లాలి. చివరగా ఉల్లికాడలు వేసి అందించాలి.


Updated Date - 2021-03-06T17:47:31+05:30 IST