Abn logo

తీపి పొంగల్‌

కావలసిన పదార్థాలు: బియ్యం - అరకప్పు, పెసరపప్పు - అరకప్పు, బెల్లం - ఒక కప్పు, యాలకులు - 3, జీడిపప్పు - 10, కిస్మిస్‌ - 10, నెయ్యి - 4 టేబుల్‌ స్పూన్లు.


తయారుచేసే విధానం: బియ్యం, పప్పులను 10 నిమిషాలు నానబెట్టాలి. చిన్న మంటపై పావు కప్పు నీటిలో బెల్లం కరిగించి వడకట్టి పక్కనుంచాలి. బియ్యం, పప్పులతో పాటు యాలకులు వేసి కుక్కర్లో 4 కప్పుల నీరు పోసి 4 విజిల్స్‌ వచ్చాక మంట తీసెయ్యాలి. చల్లారిన తర్వాత చిన్నమంటపై ఉంచి బెల్లం నీరు కలుపుతూ మిశ్రమం చిక్కబడ్డాక జీడిపప్పులు, కిస్మిస్‌ వేసి దించేయాలి.

కొబ్బరి సేమియా పాయసండబల్‌ కా మీఠాఅప్రికాట్‌ పుడ్డింగ్‌కద్దు కా హల్వాఅనోకీ ఖీర్‌పాల పోహాగోధుమ లడ్డుఆపిల్‌ హల్వాalmond, బేసన్‌ లడ్డూఇన్‌స్టెంట్‌ కలాఖండ్‌
Advertisement