Abn logo
May 4 2021 @ 09:53AM

స్విగ్గీ ఉద్యోగులకు వారానికి 4 రోజుల పని

న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా స్విగ్గి తన ఉద్యోగులకు శుభవార్త వెల్లడించింది. దేశంలో కరోనా సంక్రమణ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫాం అయన స్విగ్గి మే నెలలో తమ ఉద్యోగులకు వారానికి నాలుగురోజుల పని ప్రణాళికను ప్రకటించింది. ‘‘కొవిడ్ కేసులు పెరుగుతున్నందున ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు పనిచేసి, మూడు రోజులు విశ్రాంతి తీసుకోండి, మీరు, మీ కుటుంబసభ్యులు, స్నేహితులను జాగ్రత్తగా చూసుకోండి’’ అని స్విగ్గి హెచ్ ఆర్ హెడ్ గిరీష్ మీనన్ ఉద్యోగులుకు పంపిన అంతర్గత మెయిల్ లో కోరారు. 

కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగులకు సహాయం చేయడానికి కొవిడ్ టాస్క్ ఫోర్సును, అత్యవస సహాయ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్సు కరోనా బారిన పడిన ఉద్యోగులకు ఆసుపత్రి పడకలు, ఐసీయూలు, ప్లాస్మా, ఆక్సిజన్ సిలిండర్లు, అంబులెన్సులు  ఏర్పాటుకు ఆరోగ్య సంరక్షణ ప్రదాతల నెట్ వర్క్ ద్వారా సహాయపడతుందని స్విగ్గి వివరించింది. కరోనా సోకి హోం ఐసోలేషన్ లో ఉన్న ఉద్యోగులందరికీ రీయింబర్స్ మెంట్ కింద ఆన్ లైన్ డాక్టర్ సంప్రదింపులు, వైద్యసహాయం చేస్తుందని స్విగ్గీ వివరించింది.  


Advertisement
Advertisement
Advertisement