స్విగ్గీలో ఆర్డర్.. ఫుడ్ వస్తుంది కానీ..!

ABN , First Publish Date - 2020-03-27T02:41:23+05:30 IST

కరోనా వైరస్.. ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా భారత్ కూడా 21రో

స్విగ్గీలో ఆర్డర్.. ఫుడ్ వస్తుంది కానీ..!

న్యూఢిల్లీ: కరోనా వైరస్.. ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా భారత్ కూడా 21రోజులపాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. దీని ప్రభావం ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ఫ్లాట్‌ఫాంపై పడింది. ఈ నేపథ్యంలో స్విగ్గీ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణకు కట్టుబడి ఉంటూనే.. కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా కస్టమర్లు స్విగ్గీలో ఫుడ్‌ ఆర్డర్ చేసే సమయంలోనే ‘నో కాంటాక్ట్ డెలివరీ’ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. కస్టమర్లు ఈ ఆప్షన్‌ను ఎంచుకుని.. డెలివరీ బాయ్స్‌కు ఫోన్ చేసి, ఫుడ్ ఎక్కడ పెట్టి వెళ్లమంటే.. వాళ్లు అక్కడే పెట్టి వెళ్తారు. ఉదహరణకు డోర్ బయట ఉన్న టెబుల్, గుమ్మం, గేటు ఇలా కస్టమర్లు ఎక్కడ చెప్తే అక్కడ  ఆర్డర్ చేసిన ఫుడ్‌ను డెలివరీ బాయ్స్ పెట్టేసి వెళ్లిపోతారు. కస్టమర్ల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు స్విగ్గీ తెలిపింది. అయితే.. క్యాష్ ఆన్ డెలివరీపై ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లు ఈ సదుపాయాన్ని పొందలేరని స్పష్టం చేసింది. లాక్‌డౌన్ నేపథ్యంలో కస్టమర్లకు ఫుడ్‌ను అందుబాటులో ఉంచేందుకు స్థానిక ప్రభుత్వాలతో కలిసి పని చేస్తున్నట్లు స్విగ్గీ ప్రతినిధులు తెలిపారు. 


Updated Date - 2020-03-27T02:41:23+05:30 IST