Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇగా.. గ్రాండ్‌గా

రెండో రౌండ్‌కు డిఫెండింగ్‌ చాంప్‌

ఫెడరర్‌, కెనిన్‌ ముందంజ

ఆండ్రెస్క్యూ, బెర్టెన్స్‌ అవుట్‌

పారిస్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇగా స్వియటెక్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ను గ్రాండ్‌గా ఆరంభించింది. తొలి రౌండ్‌లో సునాయాసంగా నెగ్గిన ఈ పొలెండ్‌ భామ 20వ బర్త్‌డేను చిరస్మరణీయం చేసుకుంది. పురుషుల్లో రెండో సీడ్‌ డానిల్‌ మెద్వెదేవ్‌ రొలాండ్‌ గారో్‌సలో ఐదో ప్రయత్నంలో మొదటి రౌండ్‌ గండం గట్టెక్కాడు. ఎనిమిదో సీడ్‌ రోజర్‌ ఫెడరర్‌ వరుస సెట్ల విజయంతో రెండోరౌండ్‌ చేరాడు.  మహిళల్లో రెండోరోజు సంచలనం చోటుచేసుకుంది. ఆరోసీడ్‌ కెనడా స్టార్‌ బియాంక ఆండ్రెస్క్యూ మొదటి రౌండ్‌ ఓటమితో టోర్నీనుంచి నిష్క్రమించింది. 


స్వియటెక్‌ సులువుగా..:

రెండోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌కు గురిపెట్టిన స్వియటెక్‌ సోమవారం జరిగిన ఏకపక్ష తొలిరౌండ్‌ పోరులో 6-0, 7-5 స్కోరుతో కాజా జువాన్‌ (స్లొవేనియా)ను చిత్తుచేసింది. నాలుగో సీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా) 6-4, 4-6, 6-3తో జెలెనా ఒస్టాపెంకా (లాత్వియా)పై గెలుపొంది రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. ఈ విభాగం ఇతర మొదటి రౌండ్‌ మ్యాచ్‌ల్లో 14వ సీడ్‌ ఎలీస్‌ మెర్టెన్స్‌ (బెల్జియం) 6-4, 6-1 స్కోరుతో శాండెర్స్‌ (ఆస్ట్రేలియా)పై, 10వ సీడ్‌ బెన్సిక్‌ (స్విట్జర్లాండ్‌) 6-0, 6-3తో పొడొరోస్కా (అర్జెంటీనా)పై, 15వ సీడ్‌ విక్టోరియా అజరెంకా (బెలారస్‌) 6-4, 2-6, 6-3 స్కోరుతో కుజెంట్సోవా (రష్యా)పై నెగ్గి ముందంజ వేశారు. 


ఆండ్రెస్క్యూ, బెర్టెన్స్‌, కొంటా ఓటమి..:

మహిళల సింగిల్స్‌లో రెండోరోజు ఇద్దరు సీడెడ్‌లు పరాజయం పాలయ్యారు. స్లొవేనియాకు చెందిన తమార జిడాన్సెక్‌ 6-7 (7), 7-6 (2), 9-7తో ఆరోసీడ్‌ ఆండ్రెస్క్యూకి షాకిచ్చింది. మరో మ్యాచ్‌లో స్లొవేనియాకే చెందిన పొలోనా 6-1, 3-6, 6-4తో 16వ సీడ్‌ బెర్టెన్స్‌ (హాలెండ్‌)ను కంగు తినిపించింది. 

డానిల్‌ ఎట్టకేలకు..:

గత నాలుగు ప్రయత్నాల్లో తొలి రౌండ్‌లోనే తిరుగుముఖం పట్టిన రష్యా ఆటగాడు మెద్వెదేవ్‌ ఐదోసారి విజయం సాధించాడు. మొదటి రౌండ్‌లో డానిల్‌ 6-3, 5-3, 7-5 స్కోరుతో బబ్లిక్‌ (కజకిస్థాన్‌)పై విజయంతో రెండోరౌండ్‌లో ప్రవేశించాడు.

ఫెడరర్‌ అలవోకగా..:

స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. 2015  తర్వాత రెండోసారి మాత్రమే ఇక్కడ బరిలోకి దిగిన 39 ఏళ్ల ఫెడరర్‌ తొలిరౌండ్‌లో 6-2, 6-4, 6-3 క్వాలిఫయర్‌ డెనిస్‌ ఇస్టోమిన్‌ (ఉజ్బెకిస్థాన్‌)పై వరుస సెట్లలో నెగ్గాడు. గ్రీకుకు చెందిన ఐదోసీడ్‌ సిట్సిపాస్‌ 7-6 (8), 6-3, 6-1 స్కోరుతో జెరెమి చార్డి (ఫాన్ర్స్‌)పై, ఆరోసీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరేవ్‌ (జర్మనీ) 3-6, 3-6, 6-2, 6-2, 6-0 స్కోరుతో సహచరుడు ఒటేపై, మారిన్‌ సిలిచ్‌ (క్రొవేషియా) 7-6 (6), 6-1, 6-2 స్కోరుతో రిండర్‌క్నెచ్‌ (ఫ్రాన్స్‌)పై, 31వ సీడ్‌ జాన్‌ ఇస్నర్‌ (అమెరికా) 7-6 (2), 6-3, 6-4 స్కోరుతో సామ్‌ క్వెరీ (అమెరికా)పై నెగ్గి ముందంజ వేశారు.  

Advertisement
Advertisement