Abn logo
Sep 26 2021 @ 01:26AM

వాళ్ల పెళ్లికి ఓకేనా..? ఓటింగ్ పెట్టిన Switzerland

బెర్న్: స్వలింగ వివాహాలను ఆమోదించాలా వద్దా..? అనే విషయంపై స్విట్జర్లాండ్ ప్రభుత్వ దేశ ప్రజల నుంచి ఓటింగ్ కోరనుంది. ఆదివారం ఈ ఓటింగ్ నిర్వహించనుంది. మిగిలిన వారిలానే స్వలింగ సంపర్కులు కూడా వివాహం చేసుకుని జీవించే హక్కుపై కల్పించడంపై ఈ ఓటింగ్ జరగనుంది. ఫ్రాన్స్‌లో ఇప్పటికే దాదాపు అన్ని దేశాల్లో స్వలింగ వివాహాలకు ఆమోదం లభించింది. అయితే స్విట్జర్లాండ్ ఇంకా దీనిపై నిషేధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఒకే జెండర్‌కు చెందిన వారి వివాహాలను ఆమోదించాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ప్రభుత్వం ప్రజలకే అప్పగించింది.

కాగా.. ఇదే విషయంపై గతేడాది పార్లమెంట్‌లో చర్చించిన ప్రభుత్వం.. స్వలింగ వివాహాలకు ఆమోదం తెలిపింది. పిల్లలను కూడా దత్తత తీసుకోవచ్చని సూచించింది. అయితే ఈ నిర్ణయాన్ని దేశంలోని క్రిస్టియన్ పార్టీలు వ్యతిరేకించాయి.

స్విట్జర్లాండ్ చట్టాల ప్రకారం.. పార్లమెంట్‌లో ఆమెదించిన ఏదైనా నిర్ణయాన్ని 50వేల మందికంటే ఎక్కువ ప్రజలు వ్యతిరేకిస్తే దానిని రిఫరెండంనకు పంపిస్తారు. ఈ క్రమంలోనే అనేకమంది ప్రజలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అనేకచోట్ల నిరసనలు తెలిపారు. ఈ చట్టం వల్ల అనేకమంది పిల్లలు తండ్రిలేని వారైపోతారంటూ పోస్టర్లు సైతం అంటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం జరగబోతున్న ఓటింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...