సిడ్నీలో నాలుగు వారాలపాటు లాక్‌డౌన్ పొడగింపు

ABN , First Publish Date - 2021-07-28T21:09:51+05:30 IST

ఆస్ట్రేలియాను కరోనా డెల్టా వేరియంట్ వణికిస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలో డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. ముఖ్యంగా ఆస్ట్రేలి

సిడ్నీలో నాలుగు వారాలపాటు లాక్‌డౌన్ పొడగింపు

సిడ్నీ: ఆస్ట్రేలియాను కరోనా డెల్టా వేరియంట్ వణికిస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలో డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలోని అతిపెద్ద నగరమైన సిడ్నీలో డెల్టా వేరియంట్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. సిడ్నీలో ఇప్పటికే అమలవుతున్న లాక్‌డౌన్‌ను మరో నాలుగు వారాలపాటు పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సిడ్నీలో దాదాపు ఐదు మిలియన్ల జనాభా ఉంది. డెల్టా వేరియంట్ ప్రజలను కలవరపెడుతుండటంతో జూన్ చివరి నుంచి సిడ్నీలో స్టే హోం ఆదేశాలు అమలవుతున్నాయి. కాగా.. సిడ్నీలో ఈ ఏడాది ఇప్పటి వరకు 2500 మంది కొవిడ్ బారినపడ్డారు. 


Updated Date - 2021-07-28T21:09:51+05:30 IST