జాతీయ ఐక్యతకు చిహ్నం: ప్రియాంక

ABN , First Publish Date - 2020-08-05T07:25:11+05:30 IST

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి జరుగుతున్న శంకుస్థాపనను స్వాగతిస్తున్నట్టు కాంగ్రెస్‌ నేత ప్రియాంకా వాద్రా పేర్కొన్నారు. జాతీయ

జాతీయ ఐక్యతకు చిహ్నం: ప్రియాంక

న్యూఢిల్లీ/భోపాల్‌, ఆగస్టు 4: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి జరుగుతున్న శంకుస్థాపనను స్వాగతిస్తున్నట్టు కాంగ్రెస్‌ నేత ప్రియాంకా వాద్రా పేర్కొన్నారు. జాతీయ ఐక్యతకు అయోధ్య చిహ్నంగా మారుతుందని, సోదరభావానికి, వారసత్వ సంస్కృతికి అద్దం పడుతుందని చెప్పారు. మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ కూడా ఆలయ నిర్మాణాన్ని స్వాగతించారు. రాష్ట్ర ప్రజల తరఫున రామాలయ నిర్మాణానికి 11 వెండి ఇటుకలు పంపుతున్నట్లు తెలిపారు. మంగళవారం ఆయన తన నివాసంలో హనుమాన్‌ చాలీసా కార్యక్రమం నిర్వహించారు. 1985లో అయోధ్యలోని ఆలయాన్ని తెరిపించింది దివంగత నేత రాజీవ్‌ గాంధీయేనని కమల్‌నాథ్‌ గుర్తు చేశారు. దేశంలో రామరాజ్యం వస్తుందని 1989లో రాజీవ్‌ చెప్పారని, ఆయన ఇప్పుడు ఉండి ఉంటే తన కల సాకారం అవుతున్నందుకు ఎంతో సంతోషించేవారని అన్నారు. తాను అధికారంలో ఉన్నన్ని రోజులూ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి చేపట్టామని, గోశాలలు నిర్మించామని కమల్‌నాథ్‌ గుర్తుచేశారు. కాగా.. రామాలయం గురించి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని అలాంటి పార్టీ చేస్తున్న రాజకీయాలను రామభక్తులు అర్థం చేసుకుంటున్నారని మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా అన్నారు.  

Updated Date - 2020-08-05T07:25:11+05:30 IST