పసుపు అమ్మకాల్లో వ్యాపారుల సిండికేట్‌

ABN , First Publish Date - 2021-02-24T04:22:31+05:30 IST

నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో పసుపు అమ్మకాల్లో అంతా వ్యాపారుల మాయజాలమే కొనసాగుతోంది. ఈ మార్కెట్‌లో మొదటి నుంచి వ్యాపారులదే పైచేయిగా ఉంటోంది.

పసుపు అమ్మకాల్లో వ్యాపారుల సిండికేట్‌
మంగళవారం విక్రయానికి నిజామాబాద్‌ మార్కెట్‌కు వచ్చిన పసుపు

నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో పసుపు అమ్మకాల్లో వ్యాపారుల ఇష్టారాజ్యం 

వ్యాపారులు సిండికేట్‌ కావడంతో ధరలో హెచ్చుతగ్గులు

డిమాండ్‌కు తగ్గట్టుగా పెరగని పసుపు ధర

విధిలేక విక్రయిస్తున్న రైతులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో పసుపు అమ్మకాల్లో అంతా వ్యాపారుల మాయజాలమే కొనసాగుతోంది. ఈ మార్కెట్‌లో మొదటి నుంచి వ్యాపారులదే పైచేయిగా ఉంటోంది. మార్కెట్‌లో పసుపును కొనుగోలు చేసే వ్యాపారులు 80 మంది వరకు ఉన్నా.. 30 నుంచి 40 మంది వ్యాపారులే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. వీరిలో 15 మంది వరకు అత్యధికంగా పసుపును కొంటారు. అయితే, ఈ మార్కెట్‌లో వారు నిర్ణయించినదే రేటుగా మారుతోంది. ఈ వ్యాపారులు సిండికేట్‌గా మారి కొనుగోలు చేయడం వల్లనే డిమాండ్‌ ఉ న్నా ధర పెరగడంలేదు. గత కొన్నేళ్లుగా ఇతర రాష్ట్రాల నుం చి వ్యాపారులు ఈ మార్కెట్‌కు రావడంలేదు. ఇక్కడి వ్యా పారులే వారితో ఒప్పందాలు చేసుకుని కమీషన్‌ లెక్కన వా రికి పసుపును పంపిస్తున్నారు. ఇతర రాష్ట్రాల వ్యాపారులు రాకపోవడం వల్ల ధరలు పెరగడం లేదు. ఇతర దేశాల్లో డి మాండ్‌ ఉన్నా.. ఇక్కడి వ్యాపారులే ధరలను కంట్రోల్‌ చే స్తూ పసుపు కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్‌కు అనుగుణ ంగా ప్రతీరోజు ధర పెరగాల్సి ఉన్నా.. గత వారంతో పోలిస్తే రూ.500ల వరకు ధర తగ్గింది. రైతులు తీసుకువచ్చే పసుపులో నాణ్యత లేదని, తేమ ఉందని, ఎండలేదని ధరలను తగ్గిస్తున్నారు. కొంతమంది రైతులు ఒకరోజు ఆగినా ధర పె రగకపోవడంతో వ్యాపారులు పెట్టిన రేటుకే అమ్మకాలు చే స్తున్నారు. నిజామాబాద్‌ మార్కెట్‌లో పసుపు గ్రేడింగ్‌ చేసే యంత్రాలు లేవు. వ్యాపారులు చెప్పే గ్రేడింగ్‌ ఆధారంగానే ఈ ధరలను నిర్ణయం చేస్తున్నారు. జిల్లా అధికారులు వ్యా పారులతో సమీక్షించినా ఫలితం ఉండడంలేదు. వాతావరణ ంలో మార్పులు రావడం, చలి పెరగడం వల్ల తేమ ఎక్కువ గా ఉండడంతో తగ్గించినట్లు వ్యాపారులు చెబుతున్నారు. జి ల్లాలో గత కొన్నేళ్లుగా ఇదే రీతిలో ధరలు కొనసాగుతున్నా యి. ఈ దఫా ఆరంభంలో క్వింటాలుకు 1500లకుపైగా పె రగడంతో రైతులు సంతోషించినా మళ్లీ తగ్గడంతో ఆందోళన చెందుతున్నారు.

నిత్యం మార్కెట్‌కు 30వేల బస్తాల పసుపు

నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌కు ప్రతీరోజు 20వేల నుం ్డచి 30వేల బ్యాగుల వరకు పసుపు వస్తోంది. జిల్లాతో పాటు జగిత్యాల, నిర్మల్‌ జిల్లాలకు చెందిన రైతులు పసుపు ను తీసుకువచ్చి ఈ మార్కెట్‌లో అమ్మకాలు చేస్తునారు. ఈ మూడు జిల్లాల పరిధిలో సుమారు 70వేల ఎకరాలకుపైగా పసుపును సాగుచేశారు. అధికారుల లెక్కల ప్రకారం 15లక్షల నుంచి 18 లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అ ంచనా వేశారు. నెల రోజుల నుంచి రైతులు కొత్త పసుపును మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. గత నెలలో క్వింటా పసుపు రూ.6,500లోపు అమ్మకాలు జరిగినా.. ఈ నెల ఆరంభం ను ంచి కొంతమేర రేటు పెరిగింది. గత వారంలో  క్వింటా ప సుపు రూ.7,868 వరకు పలికింది. మళ్లీ రెండు రోజులుగా ధర కొద్దిగా తగ్గి క్వింటాలు రూ.7,348 వద్ద ఆగింది. మంగళవారం మళ్లీ కొద్దిగా పెరిగింది. క్వింటాలు పసుపు గరిష్టం గా రూ.7,989 పలికింది. మోడల్‌ రేటు మాత్రం పెరగలేదు.

కొద్ది మంది రైతులకే వస్తున్న ధర

రైతులు ప్రతీరోజు మార్కెట్‌కు పసుపును తెస్తున్నా.. వ్యా పారులు కొద్ది మందికి మాత్రమే అధిక ధర కోట్‌ చేస్తున్నా రు. కాడా రకం పసుపును గరిష్ఠంగా రూ.6వేల నుంచి రూ. 6,500ల మధ్య కొనుగోలు చేస్తున్నారు. అతి తక్కువగా క్విం టాలు రూ.4,500ల వరకు కొనుగోలు చేస్తున్నారు. గోల ర కం అతి ఎక్కువగా క్వింటాలు రూ.6,959కి కొనుగోలు చేస్తుండగా.. తక్కువగా రూ.4,2 58 మధ్య అమ్మకాలు చేస్తున్నారు. గోలాను మోడల్‌ రేటు క్వింటాలు రూ.5వేల నుంచి రూ.5,500ల మధ్యనే ఎక్కువ మంది అమ్మ కాలు చేస్తున్నారు. చూర రకం ఎక్కువగా రూ. 6,759 కొనుగోలు చేస్తుండగా.. తక్కువగా రూ.4, 700 మధ్యనే అమ్మకాలు చేస్తున్నారు. చూరకు మో డల్‌ రేటు రూ.5వేల నుంచి రూ.5,800ల మధ్య కొనుగోలు చేస్తున్నారు. ప్రతీరోజు మార్కెట్‌కు వచ్చే పసుపు లో 100 నుంచి 200ల క్వింటాళ్ల వరకు అత్యధిక ధర పె డుతున్నారు. మిగతా పసుపు అంతా మోడల్‌ రేటుకే కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌కు వచ్చే రైతులు పసుపును ఎ క్కువ రోజులు ఉంచేందుకు ఇష్టపడక వచ్చిన రేటుకే అమ్మ కాలు చేస్తున్నారు. 

డిమాండ్‌ పెరిగినా.. ధర అంతంతే

కరోనా ప్రపంచాన్నే వణికించడం వల్ల పసుపు వాడకం భారీగా పెరిగింది.  పసుపును జిల్లా నుంచి ఇతర దేశాలకు భారీగా ఎగుమతి చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పసుపు నకు డిమాండ్‌ కూడా పెరిగింది. పక్క రాష్ట్రాల్లో ఇక్కడికంటే ఎక్కువనే ధర వస్తోంది. నిజామాబాద్‌ మార్కెట్‌లో మా త్రం ఆ రాష్ట్రాల మార్కెట్‌కు దీటుగా ధర రావడంలేదు. జి ల్లాతో పాటు మిగతా జిల్లాల్లో పసుపు పండిస్తున్న రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లి అమ్ముకోలేక ఈ మార్కెట్‌లోనే అ మ్మకాలు చేస్తున్నారు. కొద్దిమంది రైతులే మహారాష్ట్రలోని సాంగ్లీకి తీసుకెళ్లి అమ్మకాలు చేస్తున్నారు. మహారాష్ట్రలో కరో నా మళ్లీ పెరగడం వల్ల సాంగ్లీకి వెళ్లడం తగ్గించిన రైతులు ప్రస్తుతం నిజామాబాద్‌ మార్కెట్‌కు తీసుకువచ్చి అమ్మకా లు చేస్తున్నారు. ఇప్పటికైనా మార్కెట్‌లో జరిగే కొనుగోళ్లపై న ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వం దృష్టిపెడితే డిమా ండ్‌కు అనుగుణంగా పపుసునకు మరింత రేటు పెరిగే అవ కాశం ఉంది. ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే రైతులకు న్యాయం జరగడంతో పాటు ధ టర పెరిగే అవకాశం ఉంది. 

ధర క్రమంగా పెరుగుతోంది..

- విజయ్‌కిషోర్‌, మార్కెట్‌ కార్యదర్శి

మార్కెట్‌లో ధర క్రమంగా పెరుగుతోందని మార్కెట్‌ కా ర్యదర్శి విజయ్‌కిషోర్‌ తెలిపారు. ఒకరోజు పెరిగి.. మరోరోజు తగ్గుతోందని ఆయన అన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం డిమాండ్‌ ఉండడం వల్ల ధర ఎక్కువగానే వస్తుందని తెలిపారు. రైతులకు మంచి ధర వచ్చేవిధంగా చూస్తున్నామని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-02-24T04:22:31+05:30 IST