సిస్టమ్‌ ఆధునీకరణతోనే రిఫండ్ల జాప్యం

ABN , First Publish Date - 2020-11-21T07:41:32+05:30 IST

ఐటీ సిస్టమ్స్‌ అప్‌గ్రేడ్‌ చేస్తూ ఉన్నందు వల్ల జూలైలోనే ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసిన వారికి పన్ను రిఫండ్లు అందించలేకపోయినట్టు ఐటీ శాఖ ప్రకటించింది. ఒక పన్ను చెల్లింపుదారుడు ఈ నెల 14వ తేదీన

సిస్టమ్‌ ఆధునీకరణతోనే రిఫండ్ల జాప్యం

న్యూఢిల్లీ: ఐటీ సిస్టమ్స్‌ అప్‌గ్రేడ్‌ చేస్తూ ఉన్నందు వల్ల జూలైలోనే  ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసిన వారికి పన్ను రిఫండ్లు అందించలేకపోయినట్టు ఐటీ శాఖ ప్రకటించింది. ఒక పన్ను చెల్లింపుదారుడు ఈ నెల 14వ తేదీన ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యకు స్పందనగా ఈ వివరణ ఇచ్చింది. ఐటీఆర్‌ల ప్రాసెసింగ్‌ మరింత వేగవంతం చేయడం కోసం తాము మరింత మెరుగైన సీపీసీ 2.0 ప్లాట్‌ఫారంనకు సిస్టమ్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్టు తెలిపింది. 2020-21 అసె్‌సమెంట్‌ సంవత్సరం ఐటీఆర్‌లన్నింటినీ సీపీసీ 2.0 వ్యవస్థ పైనే ప్రాసెసింగ్‌ చేయనున్నట్టు పేర్కొంది. ఐటీ చెల్లింపుదారులందరూ ఓర్పు వహిస్తున్నందుకు ఆ ట్విట్టర్‌ పోస్ట్‌లో ధన్యవాదాలు తెలియచేసింది. అయితే ఎంత కాలపరిధిలోగా కొత్త వ్యవస్థలోకి మారనున్నది వివరించలేదు. 


యూపీ పశుదాణా కంపెనీపై ఐటీ దాడులు

ఉత్తరప్రదేశ్‌కు చెందిన పశుదాణా తయారీ కంపెనీకి చెందిన విభిన్న కార్యాలయాలపై ఐటీ శాఖ సమాంతరంగా దాడులు నిర్వహించి రూ.52 లక్షల విలువ గల బంగారం, లెక్కల్లో చూపని రూ.121 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. ఈ గ్రూప్‌ డొల్ల కంపెనీల సహాయంతో రూ.100 కోట్లకు పైబడిన అన్‌సెక్యూర్డ్‌ రుణాలు సమీకరించిందన్న అభియోగం ఆధారంగా ఈ దాడులు నిర్వహించినట్టు సీబీడీటీ ఒక ప్రకటనలో తెలిపింది.  

ట్విట్టర్‌లో ఐటీ శాఖ వివరణ

Updated Date - 2020-11-21T07:41:32+05:30 IST