టీ కప్పు సమయం అయిపోయింది!

ABN , First Publish Date - 2022-01-25T05:30:00+05:30 IST

ఇక్కుయు తెలివైన బాలుడు. శిక్షణ కోసం గురువు గారి ఆశ్రమంలో చేరాడు. ఆ గురువు దగ్గర అరుదైన, విలువైన టీ కప్పు ఉండేది...

టీ కప్పు సమయం అయిపోయింది!

ఇక్కుయు తెలివైన బాలుడు. శిక్షణ కోసం గురువు గారి ఆశ్రమంలో చేరాడు. ఆ గురువు దగ్గర అరుదైన, విలువైన టీ కప్పు ఉండేది. ఒకరోజు అనుకోకుండా ఇక్కుయు చేతిలో నుంచి ఆ కప్పు జారి కిందపడి పగిలిపోయింది. దాంతో చాలా కంగారుపడ్డాడు. ఇంతలో గురువు గారు వస్తున్న అలికిడి వినిపించింది. వెంటనే పగిలిన కప్పు ముక్కలను ఏరి కనిపించకుండా వెనకాల దాచాడు. గురువు రాగానే ‘‘మనుషులు ఎందుకు చనిపోతారు?’’ అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న గురువు నవ్వుతూ ‘‘అది సహజం. పుట్టిన ప్రతీది చనిపోవాల్సిందే’’ అన్నాడు. అప్పుడు ఇక్కుయు పగిలిన కప్పు చూపిస్తూ ‘‘ఈరోజు కప్పు చనిపోయే సమయం వచ్చింది’’ అన్నాడు. ఇక్కుయు సమయస్ఫూర్తిని చూసి చిరునవ్వు నవ్వాడు గురువు.

Updated Date - 2022-01-25T05:30:00+05:30 IST