100 నెలలైనా విశ్వాసం కోల్పోవద్దు: రైతులతో ప్రియాంక

ABN , First Publish Date - 2021-03-07T22:51:06+05:30 IST

మీరట్‌లో ఆదివారం నిర్వహించిన ‘కిసాన్ మహాపంచాయత్’ కార్యక్రమంలో ప్రియాంక పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై విమర్శలు గుప్పిస్తూనే వాటికి వ్యతిరేకంగా

100 నెలలైనా విశ్వాసం కోల్పోవద్దు: రైతులతో ప్రియాంక

లఖ్‌నవూ: నల్ల చట్టాల్ని కేంద్రం వెనక్కి తీసుకోక తప్పదని.. దాని కోసం వంద రోజులైనా, వంద వారాలైనా, వంద నెలలైనా విశ్వాసం కోల్పోకుండా పోరాటం కొనసాగించాలని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఆదివారం నిర్వహించిన ‘కిసాన్ మహాపంచాయత్’ కార్యక్రమంలో ప్రియాంక పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై విమర్శలు గుప్పిస్తూనే వాటికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను ప్రియాంక ప్రశ్నించారు.


‘‘ప్రభుత్వానికి వేరే దారిల లేదు. నల్ల చట్టాల్ని వెనక్కి తీసుకోక తప్పదు. దీనిపై మనం విశ్వాసం కోల్పోవద్దు. ఇప్పటికి ఉద్యమం వంద రోజులు పూర్తి చేసుకుంది. వంద వారాలైనా, వంద నెలలైనా ఇంతే ఆత్మవిశ్వాసంతో పోరాటం కొనసాగించాలి. రైతులు గెలుస్తారు. దేశం గెలుస్తుంది’’ అని ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు.

Updated Date - 2021-03-07T22:51:06+05:30 IST