ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌లో టీశాట్‌ ఛానళ్లు

ABN , First Publish Date - 2020-08-15T10:20:25+05:30 IST

విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు అందిస్తోన్న టీశాట్‌ నెట్‌వర్క్‌ ఛానళ్లు ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌లో ..

ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌లో టీశాట్‌ ఛానళ్లు

హైదరాబాద్‌, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు అందిస్తోన్న టీశాట్‌ నెట్‌వర్క్‌ ఛానళ్లు ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌లో ప్రసారం కానున్నాయి. టీశాట్‌ విద్య 948, టీశాట్‌ నిపుణ 949 ఛానల్‌ నంబర్లలో ప్రసారం అవుతాయి. ఈ మేరకు టీశాట్‌ నెట్‌వర్క్‌తో ఎయిర్‌టెల్‌ సంస్థ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. కరోనా ఉధృతి నేపథ్యంలో టీశాట్‌ శాటిలైట్‌ ఛానళ్ల ద్వారా విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో టీశాట్‌ వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. పాఠశా ల, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీలు చదివే లక్షలాది మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు బోధించి ప్రయోజనం కల్పించేందుకే ఎయిర్‌టెల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీశాట్‌ సీఈవో శైలేశ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.  


Updated Date - 2020-08-15T10:20:25+05:30 IST