Abn logo
Nov 22 2020 @ 03:52AM

వరల్డ్‌ కప్‌కంటే ఐపీఎల్‌కు ప్రాధాన్యమా?

ఫ్రాంచైజీ క్రికెట్‌ నుంచి, సుదీర్ఘ ఫార్మాట్‌ వరకు తన అభిప్రాయాలను ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ అలెన్‌ బోర్డర్‌ ఓ ఇంటర్వ్యూలో నిర్మొహమాటంగా వెల్లడించాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌ను తీవ్రంగా వ్యతిరేకించే బోర్డర్‌.. ఐపీఎల్‌పై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టాడు. ఐపీఎల్‌ కోసం టీ20 వరల్డ్‌ కప్‌ను వాయిదా వేయడాన్ని తప్పుబట్టాడు. ‘పొట్టి ప్రపంచ కప్‌ విషయంలో ఐసీసీ తీసుకున్న నిర్ణయం సరికాదు. స్థానిక టోర్నీలకంటే వరల్డ్‌ కప్‌నకే ప్రాధాన్యమివ్వాలి. కానీ ఐపీఎల్‌కే ప్రాముఖ్యం ఇవ్వడమంటే డబ్బుకోసం ఆరాటపడినట్టే’ అని వ్యాఖ్యానించాడు. ఆయా బోర్డులు తమ క్రికెటర్లు ఐపీఎల్‌కు వెళ్లకుండా అడ్డుకోవాలని సూచించాడు. 

Advertisement
Advertisement