అదరగొట్టిన బేరింగ్టన్‌, జోష్‌

ABN , First Publish Date - 2021-10-20T07:50:32+05:30 IST

టీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో వరుసగా రెండో విజయం సాధించి స్కాట్లాండ్‌ సూపర్‌-12కు చేరువైంది.

అదరగొట్టిన బేరింగ్టన్‌, జోష్‌

సూపర్‌-12కు చేరువైన స్కాట్లాండ్‌

అల్‌ అమీరట్‌ (ఒమన్‌): టీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో వరుసగా రెండో విజయం సాధించి స్కాట్లాండ్‌ సూపర్‌-12కు చేరువైంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ రిచీ బేరింగ్టన్‌ (70) ధనాధన్‌ అర్ధ శతకంతోపాటు పేసర్‌ జోష్‌ డేవే (4/19) నాలుగు వికెట్లతో చెలరేగడంతో.. స్కాట్లాండ్‌ 17 పరుగుల తేడాతో పపువా న్యూ గినీ (పీఎన్‌జీ)పై గెలిచింది. గ్రూప్‌-బిలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత స్కాట్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 165/9 పరుగులు చేసింది. మాథ్యూ క్రాస్‌ (45) రాణించాడు. కబువా మోరియా 4, చాద్‌ సోపర్‌ 3 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో పీఎన్‌జీ 19.3 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. నార్మన్‌ వనువా (47) టాప్‌ స్కోరర్‌. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన పీఎన్‌జీ సూపర్‌-12కు చేరుకోవడం కష్టమే! 

సంక్షిప్త స్కోర్లు

స్కాట్లాండ్‌: 20 ఓవర్లలో 165/9 (బేరింగ్టన్‌ 70, మాథ్యూ క్రాస్‌ 45; కబువా మోరియా 4/31, చాద్‌ సోపర్‌ 3/24). 

పపువా న్యూ గినీ: 19.3 ఓవర్లలో 148 ఆలౌట్‌ (నార్మన్‌ వనువా 47, సిసీబవు 24; జోష్‌ డేవే 4/19). 

Updated Date - 2021-10-20T07:50:32+05:30 IST