Abn logo
Nov 26 2020 @ 09:57AM

నెటిజన్‌ అసభ్య కామెంట్.. తాప్సీ ఘాటు రిప్లై!

దక్షిణాదిన గ్లామరస్ పాత్రల్లో మెరిసిన ఢిల్లీ బ్యూటీ తాప్సీ ఉత్తరాదిన మాత్రం మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. వరుసగా మహిళా ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తూ తన ప్రతిభను నిరూపించుకుంది. తాప్సీ ప్రస్తుతం `రష్మి రాకెట్` సినిమాలో అథ్లెట్‌గా న‌టిస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్లను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 


ఈ ఫొటోలపై కొందరు నెటిజన్లు ట్రోలింగ్ ప్రారంభించారు. ఓ నెటిజన్ కామెంట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసిన తాప్సీ.. దానికి కౌంటర్ ఇచ్చింది. `నీకు నటన రాదు. ఎంచుకుని ఎంచుకుని సినిమాలు చేస్తున్నావు. ఫాల్తూ హీరోయిన్` అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి స్పందించిన తాప్సీ.. `నేను సరికొత్త ప్రమాణాలను సృష్టించా. ఆ విషయం నీకు అర్థం కావడం లేద`ని రిప్లై ఇచ్చింది. 



Advertisement
Advertisement
Advertisement