పరారీలో ఉన్న తబ్లీగ్ జమాత్ చీఫ్ ఆచూకీ లభ్యం

ABN , First Publish Date - 2020-04-08T15:39:31+05:30 IST

పరారీలో ఉన్న తబ్లిగ్ జమాత్ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్ ఆచూకీని ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు బుధవారం ఎట్టకేలకు...

పరారీలో ఉన్న తబ్లీగ్ జమాత్ చీఫ్ ఆచూకీ లభ్యం

ఢిల్లీ ఇంట్లోనే క్వారంటైన్...పోలీసుల వెల్లడి

న్యూఢిల్లీ : పరారీలో ఉన్న తబ్లిగ్ జమాత్ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్ ఆచూకీని ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు బుధవారం ఎట్టకేలకు కనుగొన్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న సమయంలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జమాత్ సమావేశం నిర్వహించి, దేశవ్యాప్తంగా ఈ వైరస్ ప్రబలేందుకు కారణమైన జమాత్ చీఫ్ సాద్‌పై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయన పరారీలో ఉన్నారు. ఢిల్లీలోని జాకీర్ నగర్ ప్రాంతంలోని తన నివాసంలో మౌలానా సాద్ క్వారంటైన్‌లో ఉండగా ఢిల్లీ పోలీసులు బుధవారం కనుగొన్నారు. ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్, షామ్లీ ప్రాంతాల్లో మౌలానా కోసం ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు తీవ్రంగా గాలించారు.


కరోనా ప్రబలుతున్న తరుణంలో ఢిల్లీ నిజాముద్దీన్ సమావేశాన్ని రద్దు చేయాలని పలువురు ఇస్లామిక్ మతాధికారులు సూచించినా మౌలానా సాద్ వినలేదు. దీంతో జమాత్ సమావేశం వల్ల వేల మంది జమాత్ సభ్యుల ఆరోగ్యం ప్రమాదం పడినట్లయింది. గతంలో జమాత్ సభ్యులు వైద్యులకు సహకరించాలని కోరుతూ ఆడియో సందేశాన్ని మౌలానా సాద్ విడుదల చేశారు. 

Updated Date - 2020-04-08T15:39:31+05:30 IST