తబ్లిఘీ జమాతీకి వెళ్లిన వారు స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు రావాలి: కమిషనర్‌

ABN , First Publish Date - 2020-04-05T10:46:36+05:30 IST

తబ్లిఘీ జమాతీ సమావేశానికి వెళ్లిన వారు స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు రావాలని రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్‌ అభిషిక్తి కిషోర్‌ విజ్ఞప్తి చేశారు.

తబ్లిఘీ జమాతీకి వెళ్లిన వారు స్వచ్ఛందంగా  క్వారంటైన్‌కు రావాలి: కమిషనర్‌

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 4: తబ్లిఘీ జమాతీ సమావేశానికి వెళ్లిన వారు స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు రావాలని రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్‌ అభిషిక్తి కిషోర్‌ విజ్ఞప్తి చేశారు. శనివారం రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ సమా వేశానికి వెళ్లిన వారు స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు వస్తే వారి కుటుంబాలకు  సమాజానికి మేలుచేసిన వారవుతారని, లేకపోతే వారి ద్వారా వైరస్‌ వ్యాప్తిచెంది నగరంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయన్నారు.


ఈ నెల 14వ తేదీ వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉందని ప్రజలందరూ కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలన్నారు. స్థానిక మునిసిపల్‌ కాలనీలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని ఆ ప్రాంతంలో 500 మీటర్ల వరకు కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటిం చామన్నారు. అక్కడ ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టినట్టు ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో బారీకేట్లు ఏర్పాటుచేశామన్నారు.


ఆయా ప్రాంతాలలో ఆశ వర్కర్‌లను ఇంటింటికీ పంపించి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించి ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే అటువంటి వారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నా మన్నారు. అక్కడ వైద్య సిబ్బంది 24 గంటలు పనిచేస్తారని, కంటోన్మెంట్‌ జోన్‌ లో నిత్యావసరాలు, పాలు కేంద్రాలను గుర్తించామని చెప్పారు. ఆ ప్రాంతంలో ప్రజలు నిత్యావసరాలు అవసరమైతే కంట్రోల్‌ రూం నెం.0883-2479806, 9866657620కు ఫోన్‌ చేయాలని  కోరారు. సమావేశంలో సబ్‌కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌, అదనపు కమిషనర్‌ ఎన్‌వీవీ సత్యనారాయణరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-05T10:46:36+05:30 IST