తబ్లిగీ చీఫ్‌ సహచరుల పాస్‌పోర్టులు సీజ్

ABN , First Publish Date - 2020-05-26T00:21:36+05:30 IST

తబ్లిగీ చీఫ్ మౌలానా సాద్‌ మరింత చిక్కుల్లో పడినట్టే కనిపిస్తోంది. ఆయన సన్నిహిత సహచరులైన ఐదుగురి పాస్‌పోర్ట్‌లను ఢిల్లీ క్రైమ్..

తబ్లిగీ చీఫ్‌ సహచరుల పాస్‌పోర్టులు సీజ్

న్యూఢిల్లీ: తబ్లిగీ చీఫ్ మౌలానా సాద్‌ మరింత చిక్కుల్లో పడినట్టే కనిపిస్తోంది. ఆయన సన్నిహిత సహచరులైన ఐదుగురి పాస్‌పోర్ట్‌లను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాద్ అనుచరుల్లో ముఫ్తి సహజాద్, జిస్హన్, మురసలిన్ సైఫి, మొహమ్మద్ సల్మాన్, యూనస్ ఉన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతున్నందున నిందితులెవరినీ దేశం విడిచి వెళ్లేందుకు అనుమతించరు.


క్రైమ్ బ్రాంచ్ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పాస్ పోర్ట్‌లు స్వాధీనం చేసుకున్న ఐదుగురు వ్యక్తులు మౌలానా సాద్‌కు అత్యంత సన్నిహితులని, మర్కజ్‌కు సంబంధించి సాద్ తీసుకున్న కీలక నిర్ణయాల్లో వీరి ప్రమేయం కూడా ఉందని తెలుస్తోంది. జమాత్ విదేశీ సభ్యుల గురించి ఢిల్లీ పోలీసులు గుట్టు పాటిస్తున్నప్పటికీ... త్వరలోనే 916 మంది జమాత్ సభ్యులపై ఛార్జిషీటు దాఖలు చేయనున్నట్టు సమాచారం. విదేశీ జమాత్ సభ్యులు వీసా నిబంధనలు ఉల్లంఘించాన్న కారణంగానే వీరి పాస్‌పోర్టులతో పాటు పలు డాక్యుమెంట్లు కూడా క్రైం బ్రాంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా 67 దేశాలకు టూరిస్ట్ వీసాలతో వచ్చారు. అయితే నిబంధనలకు భిన్నంగా మత సంబంధింత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం జమాత్ విదేశీ సభ్యులను పలు క్వారంటైన్ సెంటర్లలో ఉంచారు.

Updated Date - 2020-05-26T00:21:36+05:30 IST