Sep 17 2021 @ 12:51PM

స్పై థ్రిల్లర్ సిరీస్‌లో టబు..!

సీనియర్ హీరోయిన్ టబు స్పై థిల్లర్ కథాంశంతో తెరకెక్కబోతున్న వెబ్ సిరీస్‌లో నటించబోతున్నారు. జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న టబు ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల 'ఏ సూటబుల్ బోయ్' అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించారు. బీబీసీలో ప్రసారమైన ఈ సిరీస్‌కు మంచి ప్రేక్షకాదరణ దక్కింది. ఈ క్రమంలోనే టబు ప్రధాన పాత్రలో నెట్ ఫ్లిక్స్ ఇండియా మరో కొత్త సిరీస్‌ని ప్రకటించింది. 

స్పై  థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సిరీస్‌కి విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించబోతున్నారు. అమర్ భూషణ్ రచించిన 'ఎస్కేప్  టూ  నోవేర్' అనే థ్రిల్లర్ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్న దీనికి 'ఖుఫియా' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ నెలఖరు నుంచి షూటింగ్ ప్రారంభమవుతోంది. దాదాపు చిత్రీకరణ మొత్తాన్ని న్యూఢిల్లీలోనే పూర్తి చేయనున్నారట. ఇక టబు 'అలవైకుంఠపురములో' సినిమాతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం మరికొన్ని తెలుగు సినిమాలను చేస్తున్నట్టు సమాచారం. 

Bollywoodమరిన్ని...