తాకా ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు!

ABN , First Publish Date - 2020-11-22T22:51:57+05:30 IST

తెలుగు అలియాన్స్ ఆఫ్ కెనడా (తాకా) ఈ నెల 15న ఆదివారం రోజు అంతర్జాలంలో దీపావళి వేడుకలను

తాకా ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు!

ఒట్టావా: తెలుగు అలియాన్స్ ఆఫ్ కెనడా (తాకా) ఈ నెల 15న ఆదివారం రోజు అంతర్జాలంలో దీపావళి వేడుకలను ఘనంగా జరిపింది. తాకా కార్యదర్శి నాగేంద్ర హంసాల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. తాకా ప్రెసిడెంట్ శ్రీనాథ్ కుందూరి జ్యోతి ప్రజ్వలన చేశారు. తాకా వ్యవస్థాపక కార్యవర్గ సభ్యులు అరుణ్ కుమార్ లయం.. సాంస్కృతిక కార్యక్రమాలను దాదాపు 4 గంటలపాటు నిర్వహించారు. 



కాగా.. తాకా అధ్యక్షుడు శ్రీనాథ్ కుందూరు, వ్యవస్థాపక అధ్యక్షుడు చారి సామంతపూడి మాట్లాడుతూ.. భారతీయులు అందరూ కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా మన భారతీయ సంస్కృతి, కళలను ముందు తరానికి తీసుకువేళ్లాలని తెలిపారు. భారతీయ సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని వివరిస్తూ.. పది సంవత్సరాల నుంచి తాకా చేసిన కార్యక్రమాలను తెలిపారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో తాకా నిర్వహించిన తెలుగు సంస్కృతి పోటిల్లో పాల్గొనేందుకు 300 మంది చిన్నారులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్టు చెప్పారు. అంతేకాకుండా నెల రోజులపాటు నిర్వహించిన తెలుగు సంస్కృతి పోటీల్లో విజేతలుగా నిలిచిన వారి పేర్లను సీ.జీ.ఐ మిస్ అపూర్వ శ్రీవాస్తవ ప్రకటించి, వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పోటీల్లో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన అన్నాప్రగడ వేంకట నరసింహ రావు, నగశ్రీ భి. యన్, లలిత బండారు, నిర్మలా రాజేష్, మబ్బు రవిశంకర్ రెడ్డి, శ్రీదేవి మింగర, నరేష్ రామపురం తదితరులను తాకా కార్యవర్గం ప్రత్యేకంగా అభినందించింది. 



కాగా.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, టొరొంటొ మిస్ అపూర్వ శ్రీవాస్తవ, ఆల్బెర్టా రాష్ట్ర మంత్రి ప్రసాద్ పాండాతోపాటు భారత సంఘాల ప్రతినిధులు సీ.ఐ.ఎఫ్ ప్రెసిడెంట్ సతీష్ థక్కర్, ఎన్.ఏ.ఐ.సి. ప్రెసిడెంట్ ఆజాద్ కౌషిక్, ఈకాల్ అధ్యక్షుడు పర్షోత్తం గుప్త హాజరయ్యారు. చివరిగా ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన డైరెక్టర్లు మల్లికార్జున చారి పదిర, ప్రవీణ్ పెనుబాక, రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, కోశాధికారి సురేష్ కూన, కల్చరల్ సెక్రటరీ వాణి జయంతి, వైస్ ప్రెసిడెంట్ కల్పనా మోటూరి, కార్యదర్శి నాగేంద్ర హంసాల  మరియు ట్రస్ట్ సభ్యులు బాషా షేక్, రామ చంద్రరావు, దుగ్గిన, రాఘవ్ అల్లం, రాణి మద్దెల, ప్రసన్న తిరుచిరాపల్లిని తాకా అధ్యక్షుల శ్రీనాథ్ కుందూరి అభినందించారు. 


పోటీల్లో విజేతలుగా నిలిచిన వారి పేర్లు..



Updated Date - 2020-11-22T22:51:57+05:30 IST