కెనడాలో వైభవంగా 'తాకా' వారి దీపావళి వేడుకలు

ABN , First Publish Date - 2021-11-09T16:35:59+05:30 IST

తెలుగు అలయన్సస్ ఆఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో నవంబర్ 6వ తేదీ, శనివారం రోజున దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.

కెనడాలో వైభవంగా 'తాకా' వారి దీపావళి వేడుకలు

టొరంటో: తెలుగు అలయన్సస్ ఆఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో నవంబర్ 6వ తేదీ, శనివారం రోజున దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. కెనడాలోని టొరంటో నగరంలోని టొరంటో పెవిలియన్ ఆడిటోరియంలో ఈ వేడుకలు నిర్వహించారు. దాదాపు 18 నెలల తర్వాత మొట్ట మొదటి సారిగా ప్రత్యక్షంగా జరిపిన వేడుకలను 600కు పైగా మంది ప్రవాసులు హాజరై విజయవంతం చేశారు. తాకా కార్యదర్శి నాగేంద్ర హంసల అందరినీ ఆహ్వానించగా, కల్పన మోటూరి, వాణి జయంతి, పద్మ లత గుంటూరి, రజని లయం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 


కొత్త పాలక మండలి(2021-2023) 

కార్యనిర్వాహక కమిటీ:

అధ్యక్షులు: కల్పన మోటూరి  

ఉపాధ్యక్షులు: నాగేంద్ర హంసాల 

జనరల్ సెక్రటరీ: ప్రసన్న తిరుచిరాపల్లి 

కోశాధికారి: మల్లికార్జునచారిపదిర   

కల్చరల్ సెక్రటరీ: రాజా పుల్లంశెట్టి 

డైరెక్టర్: రాణి మద్దెల 

డైరెక్టర్: అనిత సజ్జ 

డైరెక్టర్: గణేష్ తెరల 


బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్:

ఛైర్మన్: మునాఫ్ అబ్దుల్

ట్రస్టీ సభ్యులు: రాఘవ కుమార్ అల్లం, సురేష్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక 

ఫౌండర్స్ చైర్మన్‌: రవి వారణాసి


భారత్, కెనడా జాతీయ గీతాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ దీపావళి  వేడుకలలో దాదాపు యాభై మంది టొరంటోలో నివసిస్తున్న చిన్నారులు, యువత, పెద్దలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ వేడుకలో కూచిపూడి, భరతనాట్యం, కథాకళి, జానపద, సినిమా గీతాలు, నృత్యాలు, నాటికలు చిన్నపిల్లల నుండి పెద్దల వరుకు పాల్గొని ప్రేక్షకులను వారి ప్రతిభ సామర్థ్యాలతో ఉర్రూతలూగించారు.


తాకా వ్యవస్థాపక సభ్యుడు శ్రీ అరుణ్ కుమార్ లయం, సాంస్కృతిక కార్యదర్శి వాణి జయంతి, డైరెక్టర్ అనిత సజ్జ ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు దాదాపు 4 గంటల పాటు నిర్వహించారు. తాకా అధ్యక్షుడు శ్రీనాథ్ కుందూరు పదవీకాలం ఈ సంవత్సరంతో ముగియనుంది. ఈ సందర్భంగా ఆయన తాము రెండు సంవత్సరాలలో చేసిన కార్యక్రమాలను సభికులకు వివరించారు. తమ కార్యవర్గానికి ఈ రెండు సంవత్సరాలలో సహకరించిన సభ్యులకు, దాతలకు, ఇతరులకు ధన్యవాదాలు తెలిపారు. టొరంటోలోని తెలుగు ప్రముఖులు వెలివోలు బసవయ్య.. శ్రీనాథ్ కుందూరును శాలువాతో సత్కరించారు.


తాకా ఫౌండర్స్ చైర్మన్ చారి సామంతపూడి కొత్తగా ఎన్నికైన కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు.  అనంతరం తాకా వ్యవస్థాపకతను వివరించారు. నూతన అధ్యక్షురాలుగా ఎన్నికైన కల్పనా మోటూరి తమ కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికి ధన్యవాదములు తెలిపారు. రాబోయే రెండు సంవత్సరాలలో ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాలను చేస్తూ, కొత్తగా సేవా కార్యక్రమాలను కూడా చేపడతామని హామీ ఇచ్చారు. ట్రస్టీస్ చైర్మన్‌గా మునాఫ్ అబ్దుల్, ఫౌండర్స్ చైర్మన్‌గా రవి వారణాసి ఎన్నికయ్యారు.


ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన డైరెక్టర్లు మల్లికార్జున చారి పదిర, ప్రవీణ్ పెనుబాక, రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, అనిత సజ్జ, గణేష్ తెరల, కోశాధికారి సురేష్ కూన, కల్చరల్ సెక్రటరీ వాణి జయంతి, కార్యదర్శి నాగేంద్ర హంసాల, ట్రస్ట్ చైర్మన్ బాషా షేక్, సభ్యులు రామ చంద్రరావు, దుగ్గిన, రాఘవ్ అల్లం, రాణి మద్దెల, ప్రసన్న తిరుచిరాపల్లి, ఇతర వ్యవస్థాపక సభ్యులు రవి వారణాసి, లోకేష్ చిల్లకూరు, రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, మునాఫ్ అబ్దుల్‌ను తాకా అధ్యక్షుడు శ్రీనాథ్ కుందూరి అభినందించారు. పిమ్మట కెనడా, భారత దేశ జాతీయ గీతాన్ని ఆలపించడం జరిగింది.











Updated Date - 2021-11-09T16:35:59+05:30 IST