Advertisement

‘తడప్’ హీరో ఒళ్లో కూర్చున్న ఫోటోలు షేర్ చేసిన ప్రియురాలు.. తండ్రి సునీల్ శెట్టి రియాక్షన్ ఏంటంటే..

టాలీవుడ్ మూవీ ‘ఆర్‌ఎక్స్ 100’ రిమేక్‌గా వచ్చిన ‘తడప్‌’తో మంచి మంచి విజయాన్ని అందుకున్న హీరో అహాన్ శెట్టి. ఆ సినిమా షూటింగ్ సందర్భంగా ఆ యంగ్ హీరోతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆయన ప్రియురాలు థానియా ష్రాప్. 


ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆ ఫోటోకి.. ‘ఈ సినిమా కోసం నువ్వు ఎంత అంకితభావంతో పని చేశావో ఎవరికి తెలియదు. కానీ దగ్గరుండి అది చూడడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. నువ్వు నీ మీద ఉన్న అంచనాలను అందుకున్నందుకు ఆనందం ఉంది. నీ ఫ్యాషన్ కంటే నీ వాళ్లపై నువ్వు చూపించే ప్రేమ ఎంతో స్ఫూర్తి కలిగిస్తుంది. అందుకే చివరి వరకూ ఇలాగే నిన్ను ప్రేమిస్తూ ఉంటాన’ని రాసుకొచ్చింది.


ఈ పోస్ట్‌కి రిప్లైగా ‘ఐ లవ్ యూ’ అహాన్ శెట్టి అని కామెంట్ పెట్టాడు. కాగా ఈ యంగ్ హీరో తండ్రి హార్ట్ ఎమోజీ పెట్టి తన సంతోషాన్ని తెలుపగా.. సోదరి అతియా శెట్టి, క్రికెటర్ కేఎల్ రాహుల్ కూడా హార్ట్ ఎమోజీలతో తమ అభిమానాన్ని తెలిపారు. అంతేకాకుండా నెటిజన్లు సైతం కామెంట్స్ కురిపించారు. ‘మీ క్యాప్షన్ నన్ను ఏడిపించింద’ని ఒకరు వ్యాఖ్యానించగా.. మీరిద్దరూ ఎంతో క్యూట్‌గా ఉన్నార‌’ని మరొకరు కామెంట్స్ చేశారు.


కాగా అహాన్, తానియా గత పదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈ యంగ్ హీరో కూడా ఆమెతో కలిసి ఉన్న ఎన్నో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తన ప్రేమను వ్యక్తపరిచాడు.


Advertisement

Bollywoodమరిన్ని...