ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ అమలు చేయాలి

ABN , First Publish Date - 2021-07-31T05:28:57+05:30 IST

ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు సక్రమంగా వినియోగించాలని డిమాండ్‌ చేస్తూ తాడేపల్లిలోని ఎస్సీ కార్పొరేషన్‌ రాష్ట్ర కార్యాలయం వద్ద శుక్రవారం దళితసంఘాలు ఆందోళన చేపట్టాయి.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ అమలు చేయాలి
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న దృశ్యం

 రాష్ట్ర కార్యాలయం ముందు దళిత సంఘాల ఆందోళన


 తాడేపల్లి టౌన్‌, జూలై30:  ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు సక్రమంగా వినియోగించాలని డిమాండ్‌ చేస్తూ తాడేపల్లిలోని ఎస్సీ కార్పొరేషన్‌ రాష్ట్ర కార్యాలయం వద్ద శుక్రవారం దళితసంఘాలు ఆందోళన చేపట్టాయి. మాలమహానాడు, ఎమ్మార్పీఎస్‌, అంబేడ్కర్‌ విధ్యార్థి విభాగం ఆధ్వర్యంలో నాయకులు నిరసన దీక్ష చేశారు. పీజీ, ఎంబీబీఎస్‌, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు స్టయిఫండ్‌ ఇవ్వకుండా అమ్మఒడి పథకంలో కలిపేశారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, విదేశీ విద్యకు తూట్లు పొడిచారని, ఎడ్యుకేషన్‌ లోన్లు నిలిపివేశారని, అన్నింటినీ పునరుద్దరించే వరకు ఆందోళన సాగిస్తామని హెచ్చరించారు. ఆందోళనలో వడ్లమాని శ్యామ్‌, పీవై కిరణ్‌కుమార్‌, మన్నవ రాజశేఖర్‌, తాడేపల్లి విజయకుమార్‌, పీటర్‌ జోసఫ్‌ పలువురు నేతలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-31T05:28:57+05:30 IST