బాలికపై లైంగిక దాడి..?

ABN , First Publish Date - 2020-12-01T05:41:08+05:30 IST

తాడేపల్లి మండలంలోని ఉండవల్లిలో బాలికపై 55 ఐదేళ్ల వ్యక్తి లైంగికదాడి చేసినట్టు వచ్చిన ఆరోపణపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

బాలికపై లైంగిక దాడి..?

తాడేపల్లి, నవంబరు 30: తాడేపల్లి మండలంలోని ఉండవల్లిలో బాలికపై 55 ఐదేళ్ల వ్యక్తి లైంగికదాడి చేసినట్టు వచ్చిన ఆరోపణపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. తాడేపల్లి సీఐ సుబ్రహ్మణ్యం కథనం ప్రకారం... ఓ అపార్టుమెంటులో వాచ్‌మన్‌ కూతురిని(5) అదే అందులో నివాసం ఉండే వ్యక్తి ఈ నెల 28వ తేదీన గొంతు పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు బాలిక తల్లిదండ్రుల దృష్టికి విషయం తీసుకెళ్లారు. దీనిపై పెద్దల సమక్షంలో విచారణ జరుగుతుండగా.. సోషల్‌మీడియాలో కథనాలు వచ్చాయి. బాధిత బాలిక తల్లిదండ్రులను సీఐ విచారించగా, వారు ఫిర్యాదు ఇవ్వడానికి నిరాకరించారు. సుమోటాగా తీసుకున్న పోలీసులు గ్రామ సచివాలయ ఉమన్‌ పోలీసు ద్వారా జరిగిన ఘటనపై కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు. 

Updated Date - 2020-12-01T05:41:08+05:30 IST